Kotak Mahindra Life | కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ గుడ్ న్యూస్.. పార్టిసిపేటింగ్ పాలసీదారులకు భారీ బోనస్..
Kotak Mahindra Life | కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (కోటక్ లైఫ్) 2025-26 ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్‌వై26) సంబంధించి సుమారు 7.7 లక్షల పార్టిసిపేటింగ్ పాలసీదారులకు రూ.1,398 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. గతేడాది బోనస్ చెల్లింపుతో పోలిస్తే ఇది 18.7 శాతం అధికం కావడం విశేషం.
Kotak Mahindra Life | కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (కోటక్ లైఫ్) 2025-26 ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్‌వై26) సంబంధించి సుమారు 7.7 లక్షల పార్టిసిపేటింగ్ పాలసీదారులకు రూ.1,398 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. గతేడాది బోనస్ చెల్లింపుతో పోలిస్తే ఇది 18.7 శాతం అధికం కావడం విశేషం. అర్హత కలిగిన పాలసీదారులకు వరుసగా 25వ సంవత్సరం కూడా బోనస్ ప్రకటించినట్లు సంస్థ వెల్లడించింది. పార్టిసిపేటింగ్ లేదా విత్-ప్రాఫిట్ పాలసీల కింద ఇచ్చే బోనస్‌లను సాధారణంగా వెంటనే చెల్లించరు. పాలసీ మెచ్యూరిటీ సమయంలో, సరెండర్ చేసినప్పుడు, మరణ క్లెయిమ్ పరిష్కార సమయంలో లేదా ఆయా ఉత్పత్తి నిబంధనల ప్రకారం చెల్లిస్తారు. పార్టిసిపేటింగ్ పాలసీల ద్వారా పాలసీదారులు హామీ ప్రయోజనాలతోపాటు సంస్థ పార్టిసిపేటింగ్ ఫండ్ ద్వారా ఆర్జించిన మిగులు లాభాల్లో కూడా వాటా పొందుతారు.
ఒకే పనిదినంలో క్లెయిమ్స్ సెటిల్‌మెంట్..
మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కోటక్ లైఫ్ వ్యక్తిగత క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి 99.5 శాతం, గ్రూప్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి 99.8 శాతంగా నమోదైంది. ఎఫ్‌వై26లో మొత్తం 1,52,860 క్లెయిమ్‌లను పరిష్కరించిన సంస్థ, వ్యక్తిగత, గ్రూప్ వ్యాపార విభాగాల్లో కలిపి రూ.2,009 కోట్లను చెల్లించినట్లు తెలిపింది. అవసరమైన అన్ని పత్రాలు అందిన తర్వాత అర్హత కలిగిన క్లెయిమ్‌లలో 84 శాతం ఒకే పని దినంలో సెటిల్ చేసినట్లు కోటక్ లైఫ్ వెల్లడించింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించే దిశగా చేపట్టిన చర్యల ఫలితమే ఇది అని పేర్కొంది. ఇటీవల జీవిత బీమా సంస్థలు వరుసగా బోనస్‌లను ప్రకటిస్తున్న నేపథ్యంలో కోటక్ లైఫ్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కోటక్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మహేష్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించడం, క్రమం తప్పకుండా బోనస్‌ల ద్వారా పాలసీదారులకు విలువను అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అత్యధిక బోనస్ ఇచ్చిన బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్..
మరోవైపు హన్సా రీసెర్చ్ నిర్వహించిన లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ స్టడీ (క్యూఈఎస్) 2026లో సంస్థ రెండో స్థానాన్ని సాధించింది. అలాగే నెట్ ప్రమోటర్ స్కోర్ (ఎన్‌పీఎస్) 60 శాతంగా నమోదైనట్లు తెలిపింది. కోటక్ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు పూర్తిగా అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 163 నగరాల్లో 372 శాఖలను కలిగి ఉంది. 5 కోట్లకు పైగా జీవితాలకు బీమా రక్షణ అందించినట్లు సంస్థ పేర్కొంది. గత నెలలో జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎఫ్‌వై26 కోసం 95 వేల మందికి పైగా పాలసీదారులకు రూ.102.54 కోట్ల బోనస్ ప్రకటించింది. అలాగే భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ పార్టిసిపేటింగ్ పాలసీదారులకు రూ.205 కోట్ల బోనస్ చెల్లింపును ప్రకటించింది. అదే సమయంలో బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తన చరిత్రలోనే అత్యధికంగా రూ.1,939 కోట్ల బోనస్‌ను ఎఫ్‌వై26లో పార్టిసిపేటింగ్ పాలసీదారులకు ప్రకటించింది. ఇది ఎఫ్‌వై25లో ప్రకటించిన రూ.1,833 కోట్లతో పోలిస్తే 5.8 శాతం ఎక్కువ కావడం విశేషం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

EPFO | ఈపీఎఫ్‌వో సభ్యులకు చాలా మందికి తెలియని బెనిఫిట్.. పైసా ఖర్చు లేకుండా రూ.7 లక్షల బీమా లభిస్తుంది..
జూన్ 11, 2026

Life Insurance | డయాబెటిస్ అంటూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణ.. ఢిల్లీ కమిషన్ కీలక తీర్పు..
మే 23, 2026

Insurance Plan | గ్యారంటీడ్ రిటర్న్స్‌తోపాటు పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసానిచ్చే కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
మే 4, 2026
తాజావార్తలు
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం



