Punna Kailash Netha | దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పున్నా కైలాశ్ సవాల్
Punna Kailash Netha | దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, కాంగ్రెస్ పార్టీని (Congress) వీడి వెళ్లిపోవాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి (Rajagopal Reddy) నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత (Punna Kailash Netha) సవాల్ విసిరారు.
Punna Kailash Netha | త్రినేత్ర న్యూస్: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, కాంగ్రెస్ పార్టీని (Congress) వీడి వెళ్లిపోవాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి (Rajagopal Reddy) నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత (Punna Kailash Netha) సవాల్ విసిరారు. ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి.. దమ్ముంటే కొత్త పార్టీ పెట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఆర్‌టీసీ ఉచిత ప్రయాణం, కొత్త పింఛన్లు ప్రజలకు ఇవ్వడం ఇష్టం లేదా అని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని, రాష్ట్రం సంక్షేమంలో ముందుకు దూసుకుపోతున్నదని చెప్పారు.
2014 నుంచి కాంగ్రెస్ జెండాను కింద పడేశావని, ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల భవిష్యత్తు కోసం మాట్లాడావా అని ధ్వజమెత్తారు. అధిష్టానం ఎన్నాళ్లని ఓపిక పడుతుందని, రాజ్ గోపాల్ రెడ్డిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నీకు మంత్రి పదవి కావాల్సింది కాంట్రాక్టర్ల కోసమేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తీరు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలతో కుమ్మక్కై రేవంత్‌పై తిరుగుబాటు చేస్తున్నట్టు కనిపిస్తుందన్నారు.
తాజావార్తలు
- ●Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
- ●Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది
- ●Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్
- ●Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- ●Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ - సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్
- ●KTR | తెలంగాణకు బాద్షా కేసీఆరే.. మళ్ల వచ్చేది ఆయనే

Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న

Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది

Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్

Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం






