Bathukamma | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | కౌలాలంపూర్‌లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు 2026 ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, జానపద కళలతో అంగరంగ వైభవంగా మలేషియా వేదికగా ప్రపంచానికి చాటేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
International | Published On Oct 18, 2026, 4.41 pm IST
Bathukamma | త్రినేత్ర న్యూస్ : కౌలాలంపూర్‌లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు 2026 ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, జానపద కళలతో అంగరంగ వైభవంగా మలేషియా వేదికగా ప్రపంచానికి చాటేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాల ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత హై కమిషన్ రాజేష్ హెచ్. మణియిల్ హాజరై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ప్రముఖ జానపద నృత్య కళాకారిణి జాను ల్యూరి, ప్రముఖ జానపద గేయ రచయిత, గాయకుడు దిలీప్ దేవ్గన్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరుణ్ కొలుగూరి పాల్గొని తమ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు. మలేషియాలోని వివిధ ఇండియన్ అసోసియేషన్ల అధ్యక్షులు, ప్రతినిధులు కూడా కార్యక్రమానికి హాజరై తెలంగాణ సంస్కృతిని ఆస్వాదించారు.

వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ తెలంగాణ వంటకాలు, ఆహార సంస్కృతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సందర్శకులు తెలంగాణ రుచులను ఆస్వాదించేలా ప్రత్యేక ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకల విజయవంతమైన నిర్వహణకు స్పాన్సర్లు GRPC Malaysia Sdn Bhd, Rapinno Tech Sdn Bhd, సంస్థలు స్పాన్సర్‌గా అందించిన సహకారం ఎంతో కీలకంగా నిలిచింది. MYTA హైదరాబాద్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ ఫుడ్ స్పాన్సర్‌గా వ్యవహరించి కార్యక్రమానికి ప్రత్యేక సహకారం అందించింది.

స్పాన్సర్లకు, ముఖ్య అతిథులకు, ఇండియన్ అసోసియేషన్ ప్రతినిధులకు, కళాకారులకు, వాలంటీర్లకు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మలేషియా తెలంగాణ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సైదం తిరుపతి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.

ఉపాధ్యక్షులు చిరుత చిట్టిబాబు, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి దండెబోయిన, ప్రధాన కార్యదర్శి సందీప్ గౌడ్, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ రావు నడిపెల్లి, కోశాధికారి సందీప్ కుమార్ లగిశెట్టి, సంయుక్త కోశాధికారి సుందర్ రెడ్డి మోర్తాల, యూత్ అధ్యక్షులు సంతోష్ దాసరాజు, యూత్ ఉపాధ్యక్షులు పోలాది శివ తేజ, అడ్వైజరీ సభ్యులు మన్సూర్, సుధీర్ మడుగురి, గోన వేణు గోపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు మారుతి, రమేష్, రాములు, పూర్ణచందర్ రెడ్డి, సుప్రియ, జ్యోతి, అనిల్ కుమార్, మహేందర్ రెడ్డి, మధు, రంజిత్ కుమార్, శేషి కుమార్, జీవన్ రెడ్డి, హరిప్రసాద్, రఘుపాల్ రెడ్డి, వినోద్ కుమార్, మహేష్, శ్రీనివాస్, నరేష్ కుమార్, రంజిత్, వెంకట్, రాజేష్, దామోదర్, దీపిక, మౌనిక పాల్గొన్నారు.

తెలంగాణ పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలను మలేషియాలో కొనసాగిస్తూ, భవిష్యత్ తరాలకు తెలంగాణ వారసత్వాన్ని పరిచయం చేయడమే తమ లక్ష్యమని MYTA ప్రతినిధులు తెలిపారు. “మన బతుకమ్మ – మన సంస్కృతి – మన తెలంగాణ- వన్ మైటా” అనే సందేశంతో 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి.



ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క
అక్టోబర్ 18, 2026

Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
అక్టోబర్ 18, 2026

MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Bollywood | టీవీ షో వివాదం - బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
- ●Navaratri Brahmotsavam | సూర్యప్రభ వాహనం విహరించిన మలయప్పస్వామి.. పరవశించిన భక్తజనం
- ●Lok Bhavan | తెలంగాణ లోక్ భవన్లో ఆయుధ పూజ
- ●Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!
- ●Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క
- ●Jagadish reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే.. ఈరోజు తెలంగాణలో కరువు ఉండేది కాదు

Bollywood | టీవీ షో వివాదం - బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

Navaratri Brahmotsavam | సూర్యప్రభ వాహనం విహరించిన మలయప్పస్వామి.. పరవశించిన భక్తజనం

Lok Bhavan | తెలంగాణ లోక్ భవన్లో ఆయుధ పూజ

Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!



