త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Foreign Currency | శంషాబాద్ విమానాశ్ర‌యంలో భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టివేత..

Foreign Currency | శంషాబాద్‌లోని విమానాశ్రయంలో (Shamshabad Airport) భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. శ‌నివారం ఉద‌యం ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు.

G

Hyderabad | Published On Oct 24, 2026, 9.57 am IST

Foreign Currency | శంషాబాద్ విమానాశ్ర‌యంలో భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టివేత..
Advertisement

Foreign Currency | త్రినేత్ర న్యూస్‌: శంషాబాద్‌లోని విమానాశ్రయంలో (Shamshabad Airport) భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. శ‌నివారం ఉద‌యం ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ప్ర‌యాణికుల నుంచి రూ.1.56 కోట్ల విలువైన విదేశీ క‌రెన్సీ (Foreign Currency)ని స్వాధీనం చేసుకున్నారు. న‌గ‌దుకు సంబంధించి స‌రైన ప‌త్రాలు చూపించ‌క‌పోవ‌డంతో వారిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు.

డిపార్చ‌ర్ విభాగంలో త‌నిఖీల సంద‌ర్భంగా మలేషియా రాజధాని కౌలాలంపూర్ (Kuala Lumpur) వెళ్లేందుకు ఎయిర్ ఏషియా విమానం కోసం వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద 66,600 అమెరిక‌న్ డాల‌ర్లు, 3,773 మ‌లేషియా రింగిట్లు, 2 సింగ‌పూర్ డాల‌ర్లు (మొత్తం రూ.63.62 ల‌క్ష‌లు) గుర్తించారు. అదేవిధంగా మ‌హిళా ప్ర‌యాణికురాలి వ‌ద్ద 97,600 అమెరికన్ డాలర్లు (రూ.91.94 ల‌క్ష‌లు) ల‌భించ‌డంతో వాటిని సీజ్ చేశారు. వీటి విలువ భార‌తీయ క‌రెన్సీలో రూ.1.56 కోట్లు ఉంటుంద‌ని డీఆర్ఐ అధికారులు వెల్ల‌డించారు. ట్రాలీ బ్యాగుల్లో దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్‌ కవర్లలో ఈ విదేశీ కరెన్సీని వారు దాచినట్లు గుర్తించిన‌ట్లు చెప్పారు. సరైన ధ్రువీకరణ పత్రాలు, చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఇంత భారీ మొత్తంలో నగదును విదేశాలకు తరలిస్తుండటంతో కస్టమ్స్ చట్టం కింద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామ‌న్నారు.

Advertisement
Advertisement