Sonia Gandhi | రూ.12వేల కోట్ల వ్యాపారం ప్రమాదంలో పడుతుంది.. ర్యాలీని వాయిదా వేసుకోండి.. సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
Sonia Gandhi | నవంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదాన్ (Ramlila Maidan)లో ఇండీ కూటమి నిర్వహించ తలపెట్టిన మెగా ర్యాలీని వాయిదా వేసుకోవలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (Chamber of Trade and Industry) లేఖ రాసింది.
Sonia Gandhi | త్రినేత్ర న్యూస్ : సర్ వ్యవహారం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదాన్ (Ramlila Maidan)లో ఇండీ కూటమి నిర్వహించ తలపెట్టిన మెగా ర్యాలీపై వ్యాపారులు (Delhi Trade Body) తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (Chamber of Trade and Industry) మూడుసార్లు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఢిల్లీ వ్యాపారులు తాజాగా సోనియా గాంధీ (Sonia Gandhi)ని ఆశ్రయించారు.
దీపావళి పండుగ ముందు ఈ మెగా ర్యాలీ కారణంగా రాజధానిలోని 20 మార్కెట్లలో సుమారు రూ. 10,000 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల వ్యాపారం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు ర్యాలీని వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సోనియాకు లేఖ రాశారు. ఈ మెగా ర్యాలీకి దాదాపు 10 లక్షల మంది ప్రజలు హాజరవుతారని CTI తన లేఖలో అంచనా వేసింది. దీంతో రామ్‌లీలా మైదానం చుట్టూ ఉన్న రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు, పార్కింగ్ సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. అందుకే పండుగ సీజన్‌లో వాణిజ్య కార్యకలాపాలకు జరిగే నష్టాన్ని తగ్గించడానికి ర్యాలీని నవంబర్ 10-11 తర్వాత పునఃసమీక్షించాలని లేదా బురారీ మైదానానికి మార్చాలని CTI కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరింది. దాదాపు 20 లక్షల మంది వ్యాపారుల తరఫున ఈ విజ్ఞప్తి చేస్తున్నామని ట్రేడ్ బాడీ తెలిపింది. తాము ఈ ర్యాలీకి వ్యతిరేకం కాదని, పండుగ సీజన్‌లో వ్యాపారాలపై పడే ప్రభావం గురించే తమ ఆందోళన అని స్పష్టం చేసింది.
Also Read..
భూటాన్‌లో బద్దలైన గ్లేసియల్ సరస్సు.. భారత్ హై అలర్ట్
ఫ్లాట్‌గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు
అక్టోబర్ 30, 2026

Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ
అక్టోబర్ 29, 2026

Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●Padi Koushik Reddy | క్రాప్ హాలిడే ఇయ్యడానికి నువ్వెవరు.. తెలంగాణ నీ జాగీరా?
- ●Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు
- ●India Poverty | భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ఇక అంతా హ్యాపీయేనా..?
- ●Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు
- ●Formula E Racing case | రేసింగ్ కేసు.. డిసెంబర్ 4కు వాయిదా
- ●Karwa Chauth | భార్య కర్వా చౌత్ వ్రతం చేయనందని.. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన భర్త..!

Padi Koushik Reddy | క్రాప్ హాలిడే ఇయ్యడానికి నువ్వెవరు.. తెలంగాణ నీ జాగీరా?

Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు

India Poverty | భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ఇక అంతా హ్యాపీయేనా..?

Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు



