JEE aspirant | కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి సూసైడ్
JEE aspirant | రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో 16 ఏళ్ల నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన హాస్టల్ గదిలో ఉరేసుకుని తనువు చాలించాడు.
JEE aspirant | త్రినేత్ర న్యూస్ : ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు ఆగడం లేదు. తాజాగా 16 ఏళ్ల నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన హాస్టల్ గదిలో ఉరేసుకుని తనువు చాలించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని శివపురికి (Shivpuri) చెందిన విద్యార్థి ఆరు నెలల క్రితమే కోటాకు వచ్చాడు. మహావీర్ నగర్-1 ప్రాంతంలోని పెయింగ్ గెస్ట్‌లో ఉంటూ స్థానికంగా ఉన్న కోచింగ్ సెంటర్‌లో జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే, రాత్రి భోజనం తర్వాత సదరు విద్యార్థి తన గది నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు అతడి రూమ్ తలుపు తట్టారు. అయినా ఎంతకీ తలుపు తెరవకపోవడంతో వాళ్లు హాస్టల్ యామజమాన్యానికి సమాచారం ఇచ్చారు.
వాళ్లు వచ్చి తలుపు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే సదరు విద్యార్థి శవమై కనిపించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. విద్యార్థిపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు లేవని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడినప్పుడు.. పరీక్ష ఉందని అతను చెప్పాడని వారు పేర్కొన్నారు. అయితే, అతను ఆ పరీక్షకు హాజరు కాలేదని, గదిలోనే ఉండిపోయాడని తర్వాత తెలిసిందని చెప్పారు. తమ కుమారుడు పరీక్షకు హాజరు కాలేదన్న విషయాన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కూడా తమకు తెలియజేయలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరుస మరణాలు..
గత కొంతకాలంగా కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వసతి గృహాల్లోని ఫ్యాన్లకు ఉరివేసుకోవడం, విషం తాగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఒత్తిడికి బలయ్యారు. దీంతో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వరుస ఘటనలతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోచింగ్ సెంటర్లకు గతంలో కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 16 ఏళ్లుపైబడిన విద్యార్థులను మాత్రమే కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవాలని పరిమితి విధించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే సరదు సంస్థలకు రూ.లక్ష జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు కోటా అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం శూన్యం.
Also Read..
వెండి దీపాలపై కమలం గుర్తు.. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనుక బీజేపీ మద్దతు..?
మైనారిటీల సమస్యలపై ప్రతిపక్షాలు మౌనం ఎందుకు..? : ఒవైసీ
జియో, పారస్ హెల్త్‌కేర్ ఐపీఓ అలాట్‌మెంట్ నేడే.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
సంబంధిత వార్తలు

Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు
అక్టోబర్ 26, 2026

Ravan Baba | 400 ఏళ్లుగా.. ఆ గ్రామానికి రావణుడే దేవుడు..!
అక్టోబర్ 20, 2026

Tiger Shroff Attackers Arrested Kota | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. రాజస్థాన్‌లో దొరికిపోయిన ముగ్గురు షూటర్లు
అక్టోబర్ 19, 2026
తాజావార్తలు
- ●Jio Platforms IPO | జియో, పారస్ హెల్త్‌కేర్ ఐపీఓ అలాట్‌మెంట్ నేడే.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
- ●BRS Leaders | ప్రైవేట్ వెబ్సైట్లో గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేస్తున్నారు.. ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
- ●Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియర్ హీరో కూతురు - వెడ్డింగ్ ఫొటోలు వైరల్
- ●Actor Dhanush | వెండి దీపాలపై కమలం గుర్తు.. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనుక బీజేపీ మద్దతు..?
- ●Foreign Portfolio Investors | భారత మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారుల భారీ నిష్క్రమణ.. 2026లో రూ.3.08 లక్షల కోట్లు వెనక్కి..
- ●Chamala Kirankumar Reddy | నీళ్లు పోతున్నది నిజమే.. ఎత్తాలంటే 93.50 మీటర్లు ఉండాలే

Jio Platforms IPO | జియో, పారస్ హెల్త్‌కేర్ ఐపీఓ అలాట్‌మెంట్ నేడే.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..

BRS Leaders | ప్రైవేట్ వెబ్సైట్లో గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేస్తున్నారు.. ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియర్ హీరో కూతురు - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Actor Dhanush | వెండి దీపాలపై కమలం గుర్తు.. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనుక బీజేపీ మద్దతు..?



