త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hardeep Singh Puri | రాజ్య‌స‌భ బ‌రిలోకి హ‌ర్దీప్ సింగ్ పురి

Hardeep Singh Puri | కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri)ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh) నుంచి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిగా బీజేపీ (BJP) బ‌రిలోకి దింపింది. బీజేపీ నేత ఎల్ ముర‌గ‌న్ రాజీనామాతో ఏర్ప‌డిన ఖాళీని హ‌ర్దీప్ సింగ్ పురితో బీజేపీ భ‌ర్తీ చేయ‌నుంది.

D

National | Published On Oct 28, 2026, 2.56 pm IST

Hardeep Singh Puri | రాజ్య‌స‌భ బ‌రిలోకి హ‌ర్దీప్ సింగ్ పురి
Advertisement

Hardeep Singh Puri | త్రినేత్ర న్యూస్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri)ని రాజ్య‌స‌భ బ‌రిలోకి దింపింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh) నుంచి రాజ్య‌స‌భ (Rajya Sabha) ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిగా బీజేపీ నామినేట్ చేసింది. బీజేపీ నేత ఎల్ మురుగ‌న్ (L. Murugan) రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి, కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ స్థానం ఖాళీ ఏర్ప‌డింది. దీంతో ఆ స్థానాన్ని హ‌ర్దీప్ సింగ్ పురితో బీజేపీ భ‌ర్తీ చేయ‌నుంది. హర్దీప్ సింగ్ పురి ప్రస్తుత రాజ్యసభ పదవీకాలం నవంబర్ 25తో ముగియ‌నుంది.

కాగా, హ‌ర్దీప్ సింగ్ పురి ప్ర‌స్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌ధాని మోదీ కేబినెట్‌లో స‌భ్యుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ వాయువు శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి జ‌ర‌గాల్సిన రాజ్య‌స‌భ ఎన్నికల్లో హ‌ర్దీప్ సింగ్ పురికి బీజేపీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఆయ‌న‌తోపాటూ సిట్టింగ్ ఎంపీలెవ‌రికీ అవ‌కాశం క‌ల్పించ‌లేదు. కేంద్ర మంత్రివ‌ర్గంలో మార్పులు చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అదే స‌మ‌యంలో కేంద్ర మంత్రికి రాజ్య‌స‌భ‌ సీటు నిరాక‌రించ‌డంతో ఇక ఆయ‌న్ని బీజేపీ ప‌క్క‌న పెట్టేసింద‌ని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉపఎన్నికకు ఆయనను నామినేట్ చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించినట్లైంది. ఈ ఉపఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయడానికి నవంబర్ 2 చివరి తేదీ కాగా, నవంబర్ 12న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.

Also Read..

ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీర‌జ్ యాద‌వ్ ఆత్మ‌హ‌త్య‌

భార‌త్ నుంచి పాక్‌కు ఆహ్వానం.. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత తొలిసారి అధికారిక పిలుపు

ఫ్లై దుబాయ్ హీరోకి అరుదైన గౌర‌వం.. స్మిత్‌ను అత్యున్న‌త పుర‌స్కారంతో స‌త్కరించిన యూఏఈ

Advertisement
Advertisement