త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ట్రిబ్యున‌ళ్ల‌ను పూర్తిగా హైజాక్ చేశారు.. కేంద్ర మంత్రిత్వ శాఖ‌పై సుప్రీం ఆగ్ర‌హం

Supreme Court | కేంద్ర కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ (MoCA)పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) నిర్వహణను పూర్తిగా హైజాక్ చేసింద‌ని మండిప‌డింది.

D

National | Published On Oct 30, 2026, 12.30 pm IST

Supreme Court | ట్రిబ్యున‌ళ్ల‌ను పూర్తిగా హైజాక్ చేశారు.. కేంద్ర మంత్రిత్వ శాఖ‌పై సుప్రీం ఆగ్ర‌హం
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : కేంద్ర కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ (MoCA)పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) నిర్వహణను పూర్తిగా హైజాక్ చేసింద‌ని (NCLT completely hijacked by Ministry of Corporate Affairs) మండిప‌డింది. ట్రిబ్యునల్స్‌ స్వయంప్రతిపత్తిని, దాని కార్యకలాపాలను దెబ్బతీసే విధంగా మంత్రిత్వ శాఖ పెత్తనం చెలాయించాలనుకోవడం సరికాదని తీవ్రంగా హెచ్చరించింది. ట్రిబ్యున‌ల్ స్వ‌తంత్రంగా ప‌నిచేసేలా అధ్యక్షులకే సర్వాధికారాలు ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో మంత్రిత్వ శాఖ ఎలాంటి నియంత్ర‌ణ‌ను ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని తేల్చి చెప్పింది.

NCLT, NCLAT లలో నెలకొన్న తీవ్రమైన మౌలిక వసతుల కొరత, ఖాళీలు, పరిపాలనాపరమైన ఇబ్బందులపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా ప్రధాన న్యాయ‌మూర్తి జస్టిస్ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనాలతో కూడిన త్రిస‌భ్య‌ ధర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. "ఇది పూర్తిగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుప్పిట్లోకి వెళ్లిపోయిందని మేం భావిస్తున్నాం. అసలు సమస్య అదే. ఇది ఆ సంస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోంది. ఎన్‌సీఎల్‌టీకి పూర్తి స్వయంప్రతిపత్తి ఉండాలని మేము భావిస్తున్నాము" అని సీజేఐ ధర్మాసనం పేర్కొంది.

ఎన్‌సీఎల్‌టీ నియామకాల్లో మంత్రిత్వ శాఖ పాత్రపై ప్ర‌శ్న‌ల వర్షం

ఎన్‌సీఎల్‌టీలో పరిపాలనా సిబ్బంది నియామక బాధ్యతలను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించాలని మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం ధ‌ర్మాస‌నం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఒక న్యాయ వ్యవస్థలో నియామకాలపై ఎవరి నియంత్రణ ఉండాలనే దానిపై ఈ నిర్ణయం ప్రశ్నలు లేవనెత్తిందని పేర్కొంది. డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, స్టెనోగ్రాఫర్ల వంటి కీలక పరిపాలనా సిబ్బందిని నియమించే కాంట్రాక్టును ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబ‌ట్టింది. ప్రైవేట్ కాంట్రాక్టర్ల జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో పారదర్శకత, స్వయంప్రతిపత్తి నిలబడాలంటే నియామకాలు, పరిపాలనా పరమైన పూర్తి అధికారాలు ఆయా సంస్థల అధ్యక్షులకే ఉండాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ఈ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనే దిశగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఎల్‌ఏటీ అధ్యక్షుల‌కు ధ‌ర్మాస‌నం సూచ‌న చేసింది. నియామకాల కోసం ప్రైవేట్ కంపెనీలను ఆశ్రయించకుండా, యూపీఎస్‌సీ (UPSC) లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వంటి ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ సంస్థల సహాయం తీసుకోవాలని తెలిపింది. తాత్కాలికంగా సిబ్బంది కొరతను తీర్చడానికి ఇతర ప్రభుత్వ శాఖల నుండి అనుభవజ్ఞులైన అధికారులను డెప్యుటేషన్‌పై తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఎల్‌ఏటీలలో అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది కొరతపై సమగ్ర నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను వాయిదా వేసింది.

Also Read..

రూ.12వేల కోట్ల వ్యాపారం ప్ర‌మాదంలో ప‌డుతుంది.. ర్యాలీని వాయిదా వేసుకోండి.. సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞ‌ప్తి

భూటాన్‌లో బ‌ద్ద‌లైన‌ గ్లేసియల్ సరస్సు.. భార‌త్ హై అల‌ర్ట్‌

కాంగ్రెస్ బ్యాంకులను నిర్మిస్తే.. బీజేపీ వాటిని అమ్ముతోంది : ఐడీబీఐ బ్యాంకు విక్రయంపై రాహుల్ గాంధీ విమర్శలు

Advertisement
Advertisement