Seethakka | గ్రామాలు అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక.. దేశంలోని తొలిసారి ఉత్తర్వులు
Seethakka | తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) పేర్కొన్నారు.
- ప్రతి పంచాయతీకి 3 నుంచి 5 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళిక
- స్థానికంగా ఏం అవసరమో దానికే ప్రాధాన్యం
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడి
Seethakka | త్రినేత్ర న్యూస్: తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలోనే తొలిసారి “GPSAP-2026” అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. స్థానికంగా ఏం అవసరమే వాటికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె ఎక్స్ వేధికగా వివరాలను వెల్లడించారు.
ప్రతి గ్రామంలోని జనాభా, కుటుంబాల స్థితిగతులు, ఉపాధి అవకాశాలు, గృహవసతి, పశుసంపద, ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రొఫైల్‌ను రూపొందిస్తారు. ప్రతి పంచాయతీకి 3 నుంచి 5 ఏళ్ల సుదీర్ఘ అభివృద్ధి ప్రణాళికతో పాటు, ప్రస్తుత సంవత్సరానికి ప్రత్యేక వార్షిక ప్రణాళికను సిద్ధం చేస్తారు. గ్రామ అవసరాలు, స్థానిక ప్రాధాన్యతల ఆధారంగా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులను ఎంపిక చేసి పూర్తి చేస్తారు.
ప్రత్యేక డాష్‌బోర్డ్ ఏర్పాటు
పారదర్శకత కోసం ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెలా జరిగే గ్రామపంచాయతీ సమావేశంలో GPSAP పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినా లేదా తప్పుడు సమాచారం అందించినా పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి అధికారుల వరకు కఠిన చర్యలు ఉంటాయి.
'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్య సాధనలో భాగంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తూ ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం అని సీతక్క తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Fine Rice Price | సన్న బియ్యం ధరలకు రెక్కలు.. నాలుగు నెలల్లో 25 శాతం పెరుగుదల
అక్టోబర్ 30, 2026

SIR | రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు
అక్టోబర్ 30, 2026

Chanti Kranti Kiran Singur Project | సింగూర్ నుంచి 22 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు: సర్కార్ నిర్లక్ష్యంపై చంటి క్రాంతి కిరణ్ ఫైర్
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ట్రిబ్యునళ్లను పూర్తిగా హైజాక్ చేశారు.. కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీం ఆగ్రహం
- ●Fine Rice Price | సన్న బియ్యం ధరలకు రెక్కలు.. నాలుగు నెలల్లో 25 శాతం పెరుగుదల
- ●Alphabet | గూగుల్‌కు ఏఐ దెబ్బ.. ఒక్కరోజే 511 బిలియన్ డాలర్ల నష్టం..
- ●Balasubrahmanyam | రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●Sonia Gandhi | రూ.12వేల కోట్ల వ్యాపారం ప్రమాదంలో పడుతుంది.. ర్యాలీని వాయిదా వేసుకోండి.. సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి

Supreme Court | ట్రిబ్యునళ్లను పూర్తిగా హైజాక్ చేశారు.. కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీం ఆగ్రహం

Fine Rice Price | సన్న బియ్యం ధరలకు రెక్కలు.. నాలుగు నెలల్లో 25 శాతం పెరుగుదల

Alphabet | గూగుల్‌కు ఏఐ దెబ్బ.. ఒక్కరోజే 511 బిలియన్ డాలర్ల నష్టం..

Balasubrahmanyam | రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత



