Fine Rice Price | సన్న బియ్యం ధరలకు రెక్కలు.. నాలుగు నెలల్లో 25 శాతం పెరుగుదల
Fine Rice Prices | ఎల్‌నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. పంట దిగుబడి కూడా పడిపోనుంది. బియ్యం వ్యాపారులకు ఇప్పుడు ఇది వరమైంది. సన్న బియ్యానికి (Fine Rice Prices) అధిక డిమాండ్ ఉండటతో దానికి క్యాష్ చేసుకునేందుకు ధరలు పెంచేశారు.
Fine Rice Prices | త్రినేత్ర న్యూస్: ఎల్‌నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. పంట దిగుబడి కూడా పడిపోనుంది. బియ్యం వ్యాపారులకు ఇప్పుడు ఇది వరమైంది. సన్న బియ్యానికి (Fine Rice Price) అధిక డిమాండ్ ఉండటతో దానికి క్యాష్ చేసుకునేందుకు ధరలు పెంచేశారు. దీంతో సన్న బియ్యానికి ఒక్కసారిగా రెక్కలు (Rising Prices) వచ్చేశాయి. నాలుగు నెలల వ్యవధిలోనే బియ్యం ధరలు 25 శాతం మేర పెరిగాయి. గతంలో కిలో రూ.50 నుంచి రూ.55 మధ్య ఉన్న సన్న బియ్యం ధరలు ప్రస్తుతం రూ.65 నుంచి రూ.83 వరకు చేరాయి. తక్కువ నాణ్యత కలిగిన సన్న బియ్యం ధర కూడా కిలో రూ.60 దాటడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోనా మసూరి, బీపీటీ రకం బియ్యం కిలో రూ.75 నుంచి రూ.90 వరకు పలుకుతున్నాయి. ఇ
నాణ్యమైన పాత బియ్యం విషయానికి వస్తే, వాటి ధర ఏకంగా రూ. 100కు చేరువవుతోంది. గతేడాది ఇదే సమయానికి కిలో రూ. 50 నుంచి రూ. 60 మధ్య ఉన్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో సామన్య, మధ్యతరగతి కుటుంబాలకు పూట గడవడమే భారంగా మారింది. ఇలాంటి తరుణంలో బియ్యం ధరలు అమాంతం పెరగడం ప్రజల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతీస్తున్నది.
కిలో బియ్యం ధర ఇలా..
జేఎస్ఆర్ ప్రీమియం కోలం- రూ.83.50
జేఎస్ఆర్ రా రైస్- రూ.74.85
లలిత సోనా మసూరి- రూ.71.33
కర్నూలు సోనా మసూరి- రూ.70
హెచ్‌ఎంటీ రా రైస్- రూ.69
రిటైల్ దుకాణాల్లో హెచ్‌ఎంటీ రా రైస్ కిలో ధర రూ.78 వరకు పలుకుతున్నది. రెండు వారాల క్రితం ఈ ధర రూ.70గా ఉండటం గమనార్హం.
ఎల్‌నినో ప్రభావం..
ఎల్‌నినో ప్రభావంతో వర్షాకాలంలో ధాన్యం దిగుబడులు అంచనాలకు తగ్గే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రాష్ట్రంలో 92.17 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి 78.23 లక్షల ఎకరాలకే సాగు పరిమితమైంది. దీంతో రానున్న రోజుల్లో బియ్యం ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో పండే తెలంగాణ సోనా, HMT, BPT వంటి నాణ్యమైన సన్న రకాలకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడి వ్యాపారులు నేరుగా నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం వంటి జిల్లాలకు వచ్చి రైతుల వద్ద అధిక ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దానిని ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు తరలిస్తున్నారు. దీంతో స్థానిక మార్కెట్‌లో బియ్యం లభ్యత తగ్గి ధరలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ నిల్వలపై లేని స్పష్టత
ధరల పెరుగుదల వెనుక అక్రమ నిల్వలు లేదా కృత్రిమ కొరత సృష్టించే చర్యలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఈ విషయంలో నిష్పక్షపాతంగా తనిఖీలు జరిపి వాస్తవాలు వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు అసలు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలు ఎన్ని ఉన్నాయనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత ఖరీఫ్‌లో పౌరసరఫరాల సంస్థ 72 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా, అందులో కేవలం 5 లక్షల టన్నులే మిగులుగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన ధాన్యంలో కొన్ని మిల్లుల వద్ద అక్రమాలు జరగడం, నాణ్యమైన బియ్యం పక్కదారి పట్టడం కూడా లభ్యతను దెబ్బతీసింది. రైస్ మిల్లర్లు పాత అప్పుల బకాయిల విధానాన్ని పక్కనపెట్టి క్యాష్ అండ్ క్యారీ నిబంధన పెట్టడంతో రిటైలర్లు తమ లాభాల మార్జిన్‌ను పెంచి బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పంట పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి రావడం, ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించే నిల్వలపై తనిఖీలు చేపట్టడం ద్వారా మాత్రమే ధరలు తిరిగి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సంబంధిత వార్తలు

SIR | రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు
అక్టోబర్ 30, 2026

Chanti Kranti Kiran Singur Project | సింగూర్ నుంచి 22 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు: సర్కార్ నిర్లక్ష్యంపై చంటి క్రాంతి కిరణ్ ఫైర్
అక్టోబర్ 29, 2026

Invest Telangana Global Summit 2026 | ఢిల్లీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమ్మిట్: 3 ట్రిలియన్ డాలర్ల టార్గెట్
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Balasubrahmanyam | రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●Sonia Gandhi | రూ.12వేల కోట్ల వ్యాపారం ప్రమాదంలో పడుతుంది.. ర్యాలీని వాయిదా వేసుకోండి.. సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
- ●Lizard | జేఎన్టీయూ మంజీరా హాస్టల్ కూరలో బల్లి.. బాధ్యులపై చర్యలకు విద్యార్థుల డిమాండ్
- ●Rahul Gandhi | కాంగ్రెస్ బ్యాంకులను నిర్మిస్తే.. బీజేపీ వాటిని అమ్ముతోంది : ఐడీబీఐ బ్యాంకు విక్రయంపై రాహుల్ గాంధీ విమర్శలు
- ●Glacial Lake Outburst | భూటాన్‌లో బద్దలైన గ్లేసియల్ సరస్సు.. భారత్ హై అలర్ట్

Balasubrahmanyam | రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..

Sonia Gandhi | రూ.12వేల కోట్ల వ్యాపారం ప్రమాదంలో పడుతుంది.. ర్యాలీని వాయిదా వేసుకోండి.. సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి

Lizard | జేఎన్టీయూ మంజీరా హాస్టల్ కూరలో బల్లి.. బాధ్యులపై చర్యలకు విద్యార్థుల డిమాండ్



