త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chocolate Murder | చాక్లెట్ కోసం గొడ‌వ‌.. 4 ఏండ్ల బాలుడిని చంపిన బాలిక‌

Chocolate Murder | చాక్లెట్ కోసం జ‌రిగిన చిన్న గొడ‌వ‌ ఓ బాలుడి ప్రాణం (Chocolate Murder) తీసింది. నాలుగేండ్ల బాలుడు చాక్లెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో 12 ఏండ్ల బాలిక అత‌డిని నీటి ట్యాంకులో ప‌డేసిన ఘ‌టన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లా శ్యామ్‌గ‌ఢ్‌లో జ‌రిగింది.

G

National | Published On Oct 30, 2026, 7.34 am IST

Chocolate Murder | చాక్లెట్ కోసం గొడ‌వ‌.. 4 ఏండ్ల బాలుడిని చంపిన బాలిక‌
Advertisement

Chocolate Murder | త్రినేత్ర న్యూస్‌: చాక్లెట్ కోసం జ‌రిగిన చిన్న గొడ‌వ‌ ఓ బాలుడి ప్రాణం (Chocolate Murder) తీసింది. నాలుగేండ్ల బాలుడు చాక్లెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో 12 ఏండ్ల బాలిక అత‌డిని నీటి ట్యాంకులో ప‌డేసిన ఘ‌టన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లా శ్యామ్‌గ‌ఢ్‌లో జ‌రిగింది.

శ్యామ్‌గ‌ఢ్‌లోని పంజాబీ కాల‌నీకి (Punjabi Colony) చెందిన‌ కృష్ణాపాల్ (4), 12 ఏండ్ల బాలికు ఈ నెల 23న చాక్లెట్ కోసం గొడ‌వ జ‌రిగింది. కృష్ణపాల్ వ‌ద్ద ఉన్న చాక్లెట్‌ను త‌న‌కు ఇవ్వాల‌ని బాలిక అడిగింది. అయితే అత‌డు ఇవ్వ‌క‌పోవ‌డంతో..రెండుసార్లు చెంప‌దెబ్బ‌ కొట్టి, అత‌ని ద‌గ్గ‌ర్నుంచి చాక్లెట్ గుంజుకుంది. దీంతో కృష్ణ‌పాల్.. బాలిక తల్లిదండ్రుల‌కు చెప్పాడు. బాలికను మందలించిన ఆమె త‌ల్లి, బాలుడికి క్షమాపణ చెప్పాలని, చాక్లెట్ తిరిగి ఇవ్వాలని సూచించింది. తల్లి మందలించడంతో కోపం పెంచుకున్న బాలిక‌.. బాలుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

ఈక్ర‌మంలో అక్టోబర్ 24న శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణపాల్‌ను తీసుకెళ్లిన బాలిక.. పొరుగింటి వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ మూతను (Water Tank) తీసి అందులో పడేసి మళ్లీ మూత పెట్టింది. అయితే కృష్ణపాల్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర కాలనీల్లో వెతికారు. అయినా అతడి ఆచూకీ కనిపించక‌పోవ‌డంతో అదేరోజు రాత్రి శ్యామ్‌గఢ్ (Shamgarh) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేప‌ట్టారు.

ద‌ర్యాప్తులో భాగంగా కాలనీలోని నీటి ట్యాంకుల మూతల్ని తెరిచి పరిశీలించారు. పొరుగింటి నీటి ట్యాంకులో కృష్ణపాల్ మృతదేహం తేలుతూ కనిపించింది. దీంతో బాలుడి మృతికి గ‌ల‌ కారణాలపై ఆరాతీశారు. ఈ క్ర‌మంలో 12 ఏండ్ల‌ ఆ బాలికను, కాలనీలోని ఇతర పిల్లలను ప్రశ్నించారు. త‌మ మ‌ధ్య‌ చాక్లెట్ (Chocolate) విషయంలో జరిగిన గొడవ జ‌రిగింద‌ని, కృష్ణ‌పాల్‌ను తానే నీటి ట్యాంకులో పడేసినట్లు బాలిక అంగీకరించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. అనంత‌రం ఆమెను మంద్‌సౌర్‌లోని జువెనైల్ హోమ్‌కు తరలించారు.

Advertisement
Advertisement