Balasubrahmanyam | రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
Balasubrahmanyam | రిటైర్డ్ ఐపీఎస్ అధికారి (Retired IPS officer), ఏపీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం (Balasubrahmanyam) కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
- అమెరికాలో క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస
- సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డీజీపీ అంజనీ కుమార్
Balasubrahmanyam | త్రినేత్ర న్యూస్ : రిటైర్డ్ ఐపీఎస్ అధికారి (Retired IPS officer), ఏపీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం (Balasubrahmanyam) కన్నుమూశారు. కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా పనిచేస్తూ ఈ ఏడాది ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్లారు. భౌతికకాయాన్ని మరో మూడు రోజుల్లో అమెరికా నుంచి హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా పోలీస్ వ్యవస్థలో ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు, సహచరులకు సానుభూతి తెలిపారు. నిజాయితీ, అంకితభావం, గట్టి నిర్ణయాలు తీసుకోగల సమర్థవంతమైన అధికారిగా బాలసుబ్రమణ్యం గుర్తింపు పొందారన్నారు. పోలీస్, ఇంటెలిజెన్స్, రవాణా, ప్రజా పాలన విభాగాల్లో ఆయన అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.
అజనీ కుమార్ సంతాపం
బాలసుబ్రహ్మణ్యం మృతి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల తెలంగాణ మాజీ డీజీపీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాప సందేశం విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ విభాగంలో కలిసి పనిచేసిన రోజులను అంజనీ కుమార్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం ఎంతో నిబద్ధత, ధైర్యసాహసాలు కలిగిన అధికారిగా పనిచేశారని కొనియాడారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేయడానికి అవసరమైన సహనం, అంకితభావం, గోప్యతను ఆయన సమర్థంగా పాటించారని పేర్కొన్నారు. ఆయన నివేదికలు, విశ్లేషణలు, క్షేత్రస్థాయి పనితీరు రాష్ట్ర భద్రతకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చారు.
Also Read..
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
అక్టోబర్ 30, 2026

Sonia Gandhi | రూ.12వేల కోట్ల వ్యాపారం ప్రమాదంలో పడుతుంది.. ర్యాలీని వాయిదా వేసుకోండి.. సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
అక్టోబర్ 30, 2026

Lizard | జేఎన్టీయూ మంజీరా హాస్టల్ కూరలో బల్లి.. బాధ్యులపై చర్యలకు విద్యార్థుల డిమాండ్
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●Sonia Gandhi | రూ.12వేల కోట్ల వ్యాపారం ప్రమాదంలో పడుతుంది.. ర్యాలీని వాయిదా వేసుకోండి.. సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
- ●Lizard | జేఎన్టీయూ మంజీరా హాస్టల్ కూరలో బల్లి.. బాధ్యులపై చర్యలకు విద్యార్థుల డిమాండ్
- ●Rahul Gandhi | కాంగ్రెస్ బ్యాంకులను నిర్మిస్తే.. బీజేపీ వాటిని అమ్ముతోంది : ఐడీబీఐ బ్యాంకు విక్రయంపై రాహుల్ గాంధీ విమర్శలు
- ●Glacial Lake Outburst | భూటాన్‌లో బద్దలైన గ్లేసియల్ సరస్సు.. భారత్ హై అలర్ట్
- ●TGCHE | సినిమా కోసం కాలేజీకి సెలవు.. మల్లారెడ్డి వర్సిటీకి ఉన్నత విద్యామండలి నోటీసులు!
- ●Stock Markets | ఫ్లాట్గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి..

Sonia Gandhi | రూ.12వేల కోట్ల వ్యాపారం ప్రమాదంలో పడుతుంది.. ర్యాలీని వాయిదా వేసుకోండి.. సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి

Lizard | జేఎన్టీయూ మంజీరా హాస్టల్ కూరలో బల్లి.. బాధ్యులపై చర్యలకు విద్యార్థుల డిమాండ్

Rahul Gandhi | కాంగ్రెస్ బ్యాంకులను నిర్మిస్తే.. బీజేపీ వాటిని అమ్ముతోంది : ఐడీబీఐ బ్యాంకు విక్రయంపై రాహుల్ గాంధీ విమర్శలు

Glacial Lake Outburst | భూటాన్‌లో బద్దలైన గ్లేసియల్ సరస్సు.. భారత్ హై అలర్ట్



