Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు
Admissions | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎడ్ (ఓడీఎల్), సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం (Admissions) నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
Admissions | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎడ్ (ఓడీఎల్), సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం (Admissions) నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
2026-27 విద్యాసంవత్సరానికి గాను బీఎడ్ (ఓడీఎల్ - ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) ప్రవేశాల అర్హత పరీక్షకు డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నెల 24వ తేదీ వరకు అధికారిక పోర్టల్ www.braouonline.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
కోర్సు కాలవ్యవధి కనీసం 2 విద్యాసంవత్సరాలు. గరిష్టంగా 4 విద్యాసంవత్సరాలుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిగా తెలుగు మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పరీక్షలు, అసైన్‌మెంట్లు, రికార్డులు అన్నీ తెలుగులోనే రాయాల్సి ఉంటుంది. రెండేండ్ల కోర్సుకు గాను మొత్తం రూ.40,000 ట్యూషన్ ఫీజును చెల్లించాలి. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 040-23680333 హెల్ప్‌లైన్ నంబరులో సంప్రదించవచ్చు.
ఈ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహా మిగిలిన అన్ని కేటగిరీల అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కులుగా 35 మార్కులను నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ప్రవేశ పరీక్ష ఫీజు: రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.750
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 24
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: జూలై 29
ప్రవేశ పరీక్ష: ఆగస్టు మొదటి వారం (ఆగస్టు 2)
ఫలితాల విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్: ఆగస్టు రెండో వారం
అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ: ఆగస్టు రెండో వారం నుంచి
వెబ్‌సైట్: www.braouonline.in
FCRIలో బీఎస్సీ ఫారెస్ట్రీ..
సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FCRI) 2026-27 విద్యాసంవత్సరానికి గాను బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్ కోర్సులో (BSc Forestry) ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలయింది. జూలై 25 వరకు https://www.fcrihyd.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో మొత్తం 65 సీట్లను భర్తీ చేస్తారు. ఈ కాలేజీ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నది. ఐసీఎఫ్ఆర్ఈ (ICFRE), ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందింది. కోర్సు మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటుంది.
మొత్తం సీట్లు: 65
ఇందులో రెగ్యులర్ సీట్లు 50, ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా 5, పేమెంట్ కోటా 10 చొప్పున ఉన్నాయి.
అర్హత: 10+2 విధానంలో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్‌లో బైపీసీ, ఎంబైపీసీ, ఎంపీసీ గ్రూపులను చదివి, తెలంగాణ విద్యార్థులై ఉండాలి. ఇంటర్ సబ్జెక్టులతో సంబంధం లేకుండా.. రెగ్యులర్ లేదా పేమెంట్ కోటా కింద బీఎస్సీ ఫారెస్ట్ సీటు సాధించాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) ప్రవేశ పరీక్ష రాసి, అందులో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్లకు చివరితేదీ: జూలై 25
అప్లికేషన్ ఫీజు: జనరల్ లేదా బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 400, పేమెంట్ కోటా కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు రూ.3,000
అధికారిక వెబ్‌సైట్: https://www.fcrihyd.in/
సంబంధిత వార్తలు

Ambedkar Open University | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
జూన్ 24, 2026

Private Schools | రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఇవే.. ఓ లుక్కేయండి..
ఏప్రిల్ 30, 2026

Entrance Exams | ఫిబ్రవరి మొదటివారంలో ఈసెట్, లాసెట్ నోటిఫికేషన్లు.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?
జనవరి 28, 2026
తాజావార్తలు
- ●Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం
- ●Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం
- ●Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
- ●WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..

Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం

Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం

Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?

Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..




