Meta | ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనలపై మెటా వివరణ.. చిన్నారుల భద్రత కోసం కోట్ల అకౌంట్లపై చర్యలు..
Meta | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న కొన్ని ప్రకటనలు బాలల లైంగిక దోపిడీకి అనుకూలంగా ఉన్నాయని వచ్చిన ఆరోపణలపై ఆ సంస్థ స్సందించింది. ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ఆ వార్తలు, ఆరోపణలపై స్పందిస్తూ తమ ప్లాట్‌ఫామ్‌లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న యూజర్ల అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
Technology | Published On Jul 8, 2026, 2.46 pm IST
Meta | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న కొన్ని ప్రకటనలు బాలల లైంగిక దోపిడీకి అనుకూలంగా ఉన్నాయని వచ్చిన ఆరోపణలపై ఆ సంస్థ స్సందించింది. ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ఆ వార్తలు, ఆరోపణలపై స్పందిస్తూ తమ ప్లాట్‌ఫామ్‌లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న యూజర్ల అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అలాంటి కంటెంట్, యాడ్స్‌ను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఆరోపణలు రాకముందు నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే విషయమై పకడ్బందీ వ్యవస్థలను అమలు చేస్తున్నామని మెటా తెలియజేసింది. కొన్ని రకాల ప్రకటనలు మోసపూరితంగా ఉంటున్నాయని, ముఖ్యంగా బాలల లైంగిక దోపిడీకి అనుకూలంగా ఉండే ప్రకటలను తాము గుర్తించామని, అలాంటి యూజర్ల ఖాతాలను ఇప్పటికే నిలిపివేశామని తెలిపింది. విచారణ అనంతరం ఈ ఆరోపణలపై ఇంకా లోతుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మరిన్ని ఖాతాలను కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
40 లక్షలకు పైగా ఖాతాల తొలగింపు..
చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించే యూజర్లను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని, అలాంటి వారి అకౌంట్లను తొలగిస్తామని మెటా తెలిపింది. పిల్లలకు సంబంధించిన ప్రకటనలను సైతం ఉద్దేశపూర్వకంగా ప్రదర్శించడాన్ని తాము నిరోధిస్తున్నామని పేర్కొంది. ఈ విషయంలో వచ్చిన ఆరోపణలను మెటా తోసిపుచ్చింది. పిల్లలకు సంబంధించి అనుమానాస్పద కార్యకలాపాలను చేపట్టే ఖాతాలను గుర్తించేందుకు తాము సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అలాంటి 40 లక్షలకు పైగా ఖాతాలను ఆటోమేటిగ్గా తొలగించామని తెలిపింది. తమ ప్రకటనల విధానాలను అమలు చేసేందుకు ఆటోమేటెడ్ సిస్టమ్‌లు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయని, అలాగే మాన్యువల్ రివ్యూలను కూడా చేపడుతున్నామని తెలిపింది.
యూజర్లు ఫిర్యాదు చేయవచ్చు..
ప్రకటలను అనుమతించడానికన్నా ముందే ఆటోమేటిగ్గా చెకింగ్‌లు చేస్తామని, అదే సమయంలో సంస్థ విధానాలను ఉల్లంఘిస్తున్నాయని అనుమానిస్తే వెంటనే అలాంటి ప్రకటనలను రివ్యూ కోసం పంపిస్తామని తెలియజేసింది. అందుకు ప్రత్యేక బృందం ఉంటుందని, అలాగే యూజర్లు తమకు అలాంటి కంటెంట్ కనిపించినా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది. రిపోర్టు చేసిన కంటెంట్‌ను కూడా తాము సమీక్షిస్తామని, ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణి ఉండదని తెలిపింది. అలాగే రివ్యూ ప్రక్రియలో సరైన కంటెంట్ అని తేలితే ప్రకటనలను పునరుద్ధరిస్తామని, ఒక వేళ నిజంగానే అనుచితంగా ఉంటే అలాంటి ప్రకటనలను అనుమతించబోమని తెలిపింది.
పూర్తిగా రివ్యూ..
రివ్యూల్లో భాగంగా కంటెంట్‌లో ఉండే వీడియోలు, టెక్ట్స్, ఫొటోలు అన్నింటినీ తనిఖీ చేస్తామని, ఆ తరువాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అయితే పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రకటనలు ఇచ్చే లేదా కంటెంట్‌ను పోస్టు చేసే యూజర్ల ఖాతాలను శాశ్వతంగా తొలగిస్తామని కూడా తెలిపింది. ఇక అలాంటి కంటెంట్‌తోపాటు యూజర్లను కూడా ఏటా భారీ సంఖ్యలో తొలగిస్తున్నామని, అందుకు ఏఐ సహాయం తీసుకుంటున్నామని మెటా స్పష్టం చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌లలో బాలల లైంగిక దోపిడీ, మోసాలు, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలను గుర్తించేందుకు అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉందని, ప్రకటనలు ఎప్పటికప్పుడు పూర్తిగా సమీక్షిస్తామని, అవసరం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
సంబంధిత వార్తలు

Apple | ఎన్విడియాను వెనక్కి నెట్టిన యాపిల్.. ప్రపంచంలోనే నంబర్ వన్ సంస్థగా మళ్లీ సెటిల్..
జులై 18, 2026

US Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. మద్దతు తెలిపిన యూఎస్ సెనేటర్లు
జులై 17, 2026

Gmail | యూజర్లకు గుడ్ న్యూస్.. జీమెయిల్లో ఏఐని ఇక కావల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు..
జులై 16, 2026
తాజావార్తలు
- ●Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
- ●Weekly Horoscope | ఈరాశివారు ఆశించిన ఫలితాలు పొందుతారు.. ఆ పనులకు దూరంగా ఉంటే మంచింది!
- ●ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..
- ●Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

Weekly Horoscope | ఈరాశివారు ఆశించిన ఫలితాలు పొందుతారు.. ఆ పనులకు దూరంగా ఉంటే మంచింది!

ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..

Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!



