Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
Prambanan Temple | ప్రంబనన్ (Prambanan).. ఇండోనేషియా (Indonesia)లో ఉన్న 1000 ఏళ్ల క్రితం నాటి హిందూ ఆలయం. ఈ ఆలయ సముదాయంలో దాదాపు 240 ఉప ఆలయాలు ఉన్నాయి. ప్రంబనన్ ఆలయంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నిలయమే ప్రంబనన్ ఆలయం.
Prambanan Temple | త్రినేత్ర.న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా (Indonesia) పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మోదీ ఆదేశంలో ఉన్న 1000 ఏళ్ల క్రితం నాటి హిందూ ఆలయాన్ని సందర్శించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన యోగ్యకర్తలోని (Yogyakarta) చారిత్రాత్మక ప్రంబనన్ (Prambanan) ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రంబనన్ ఆలయం అద్భుతంగా ఉందని చెప్పారు.
The majestic Prambanan Temple! pic.twitter.com/pRS2S9X5gm
— Narendra Modi (@narendramodi) July 8, 2026
అతిపెద్ద హిందూ దేవాలయం
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయం (Prambanan Temple) 9వ శతాబ్దానికి చెందిన అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. కాంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ తర్వాత దక్షిణాసియాలోనే రెండవ అతిపెద్ద ఆలయ కాంప్లెక్స్‌గా 'ప్రంబనన్' (Prambanan)కు గుర్తింపు ఉంది. ఇండోనేషియాలోని జావా ద్విపకల్పంలో యోగ్యకర్త (Yogyakarta) నగరానికి ఈశాన్యంగా 17 కి.మీ దూరంలో సుమారు 40 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఆలయం విస్తరించి ఉంది.
#WATCH | Prime Minister Narendra Modi and Indonesian President Prabowo Subianto visit Prambanan Temple in Yogyakarta and offer prayers here.
(Video: DD News) pic.twitter.com/H0GxrZWVQb
— ANI (@ANI) July 8, 2026
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నిలయం
ఈ ఆలయ సముదాయంలో దాదాపు 240 ఉప ఆలయాలు ఉన్నాయి. ప్రంబనన్ ఆలయంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నిలయమే ప్రంబనన్ ఆలయం. 47 మీటర్ల ఎత్తుతో ఉన్న శివాలయం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ గోడలపై రామాయణ కథను అద్భుతమైన శిల్పాలుగా చెక్కారు. ఆలయం పక్కనే జరిగే రామాయణ బాలే (Ramayana Ballet) నృత్య ప్రదర్శనలు పర్యాటకులను విశేతంగా ఆకట్టుకుంటాయి.
Prambanan Temple complex originally comprised 240 large and small temples dedicated to Brahma, Vishnu and Shiva. It stands as a remarkable testament to the spread of Indian cultural influence across Southeast Asia.
The Ramayana narrative reliefs carved along the galleries of the… pic.twitter.com/rS6kMDRNvN
— All India Radio News (@airnewsalerts) July 8, 2026
శిథిలావస్థ నుంచి పునర్నిర్మాణం వరకూ..
జావాలో రాజకీయ మార్పులతో పాటు మౌంట్ మిరాపీ వద్ద అగ్నిపర్వతం పేలడం వల్ల 10వ శతాబ్ధంలో ప్రంబనన్ ఆలయ సముదాయం నిర్లక్ష్యానికి గురైంది. ఆ తర్వాత సంభవించిన శక్తివంతమైన భూకంపాల ధాటిని ఈ నిర్మాణాల్లో చాలా భాగం శిథిలావస్థకు చేరుకున్నాయి. 19వ శతాబ్ధంలో డచ్ పాలన సమయంలో మళ్లీ ఆలయ పునరుద్దరణ చేపట్టారు. ఆ తర్వాత 1913 నుంచి 1953 మధ్య కాలంలో చేపట్టిన భారీ పురావస్తు పునర్నిర్మాణ చర్యల ఫలితంగా అనేక ప్రధాన ఆలయాలు తమ పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకున్నాయి. నేడు ఇండోనేషియాలో అత్యధికులు సందర్శించే పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.
#WATCH || Prime Minister @narendramodi visits the iconic Prambanan Temple in Yogyakarta as chants of "Om Namah Shivaya" resonate through the sacred complex, reflecting the deep civilizational and cultural bonds between India and Indonesia.@MEAIndia @IndianEmbJkt… pic.twitter.com/iTHfkyDimO
— All India Radio News (@airnewsalerts) July 8, 2026
యునెస్కో గుర్తింపు..
ఈ ఆలయానికి ఉన్న అత్యంత అరుదైన సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన యునెస్కో (UNESCO) 1991లో ప్రంబనన్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఆలయ పునరుద్ధరణలో భారత్ భాగస్వామ్యం..
భూకంపాల వల్ల దెబ్బతిన్న ఈ ఆలయాల పునరుద్ధరణలో భారత్ కూడా భాగస్వామ్యం వహించింది. సాంకేతిక సహకారం అందించింది. అంతేకాదు, ఆలయ సముదాయ పరిరక్షణ, పునరుద్ధరణ కోసం భారత పునరావస్తు సర్వే (ASI) భాగస్వామ్యంతో ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి ఈ ప్రాజెక్టును సంయుక్తంగా ప్రారంభించారు.

Prime Minister @narendramodi's remarks at the inauguration of the Prambanan Temple Restoration Project in #Yogyakarta#PrambananTemple @PMOIndia @prabowo pic.twitter.com/AHiHkAk2H6
— PIB India (@PIB_India) July 8, 2026
Also Read..
అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
సంబంధిత వార్తలు

PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ
జులై 7, 2026

Hydrogen Train | దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు.. జులై 17న జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జులై 7, 2026

PM Modi Tour’s | మూడు దేశాల పర్యనటకు మోదీ.. కీలక ఒప్పందాలపై చర్చించనున్న ప్రధాని
జులై 6, 2026
తాజావార్తలు
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
- ●WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
- ●woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..
- ●Vemula Prashanth Reddy | ఇప్పటికైనా మొండి పట్టు వీడండి.. కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోసి రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- ●ITR | ఐటీఆర్‌లో కొత్త సెక్షన్.. పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పు..

Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..

woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..



