Halwa | ఓటు వెయ్యి.. హల్వా తీసుకో.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈసీ
Halwa | కేరళ (Kerala)లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువత ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టింది. మొదటిసారి ఓటు వేయనున్న ఓటర్లకు ఎంపిక చేసిన పోలింగ్ బూత్‌లలో హల్వా (Halwa)ను అందించాలని నిర్ణయించింది.
Halwa | కేరళ (Kerala)లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువత ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టింది. మొదటిసారి ఓటు వేయనున్న ఓటర్లకు ఎంపిక చేసిన పోలింగ్ బూత్‌లలో హల్వా (Halwa)ను అందించాలని నిర్ణయించింది. రాబోయే ఎన్నికల్లో యువతను ఓటు వేసేలా ప్రోత్సహించే లక్ష్యంతో "ఓట్ స్వీటెన్డ్ కేరళ క్యాంపెయిన్" పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు కేల్కర్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాలోని ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో కొత్తగా ఓటు వేసే ఓటర్లకు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన హల్వాను పంపిణీ చేయనున్నారు. ఇందుకు గానూ ప్రతి జిల్లాకు 200 హల్వా ప్యాకెట్లను పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో ఏ పోలింగ్ బూత్‌లను చేర్చాలో ఆ అధికారులు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు ఈ హల్వా ప్యాకెట్లను ఆయా పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేయనున్నారు. బూత్ స్థాయి అధికారులు, వాలంటీర్లతో కలిసి మొదటిసారి ఓటు వేస్తున్న వారిని గుర్తించి, నిర్దేశిత బూత్‌లలో హల్వా ప్యాకెట్ల పంపిణీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. కొత్త ఓటర్లకు ఉత్సాహం కలిగించడమే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని ఈసీ తెలిపింది.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల తరపున కేరళలో ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేసిన తరహాలోనే కేరళలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఐదు గ్యారంటీలను ప్రకటించింది.
Also Read..
తెలంగాణ నీటి కేటాయింపుల్లో రాజీ పడం: మంత్రి జూపల్లి
స్టాక్ బ్రోకర్లకు నిబంధనలు మరింత కఠినతరం.. తక్షణ లిక్విడిటీపై ప్రభావం చూపే అవకాశం..
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






