RBI | స్టాక్ బ్రోకర్లకు నిబంధనలు మరింత కఠినతరం.. తక్షణ లిక్విడిటీపై ప్రభావం చూపే అవకాశం..
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఓ కీలక విధాన సవరణను ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా స్టాక్ బ్రోకర్లు ఎలా నిధులు సమీకరిస్తారు, తమ కోలాటరల్‌ను ఎలా నిర్వహిస్తారు అన్న అంశాలపై ఈ కొత్త నియమాలు కీలకంగా పనిచేయనున్నాయి.
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఓ కీలక విధాన సవరణను ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా స్టాక్ బ్రోకర్లు ఎలా నిధులు సమీకరిస్తారు, తమ కోలాటరల్‌ను ఎలా నిర్వహిస్తారు అన్న అంశాలపై ఈ కొత్త నియమాలు కీలకంగా పనిచేయనున్నాయి. ఇప్పటి వరకు బ్రోకర్లు రుణాలు లేదా బ్యాంక్ గ్యారంటీలు పొందేందుకు భౌతిక ఆస్తులతో పాటు ప్రొమోటర్ గ్యారంటీలు (వ్యక్తిగత లేదా సంస్థ హామీలు) ఉపయోగించేవారు. అయితే కొత్త నియమం ప్రకారం ఇకపై అన్ని రుణాలు పూర్తిగా స్పష్టమైన ఆస్తుల ఆధారంగానే పొందాల్సి ఉంటుంది. అంటే.. ఉదాహరణకు ఒక బ్రోకర్ రూ.100 రుణం తీసుకుంటే అంతే విలువైన ఆస్తులను నగదు లేదా సెక్యూరిటీల రూపంలో తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇకపై కాగితం హామీలు చెల్లవు. దీని వల్ల సంస్థలు తమ సొంత సంపదను మరింతగా ఉపయోగించాల్సి వస్తుంది.
బ్యాంక్ గ్యారంటీకి 50 శాతం కోలాటరల్ తప్పనిసరి..
బ్యాంక్ గ్యారంటీలు స్టాక్ ఎక్స్చేంజ్‌లతో బ్రోకర్ల క్లియరింగ్ బాధ్యతలను నిర్వహించడంలో కీలకం కాగా గతంలో వీటికి నగదు, షేర్ల మిశ్రమాన్ని ఉపయోగించేవారు. కొత్త నిబంధన ప్రకారం బ్యాంక్ గ్యారంటీకి కనీసం 50 శాతం కోలాటరల్ తప్పనిసరి. ఇందులో కనీసం 25 శాతం పూర్తిగా నగదు రూపంలో ఉండాలి. దీని వల్ల బ్రోకర్లకు తక్షణ లిక్విడిటీ అందుబాటులో ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో నగదు బ్యాంక్ ఖాతాల్లో నిల్వ ఉంచాల్సి రావడం వల్ల మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గే అవకాశం ఉంది. బ్రోకర్లు షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందినప్పుడు, బ్యాంకులు వాటి పూర్తి మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకోవు. భవిష్యత్తులో మార్కెట్ పడిపోవచ్చనే భయంతో హెయిర్‌కట్ విధిస్తారు.
40 శాతం హెయిర్‌కట్..
కొత్త నియమం ప్రకారం RBI ఈక్విటీ కోలాటరల్‌పై 40 శాతం హెయిర్‌కట్‌ను తప్పనిసరి చేసింది. ఉదాహరణకు రూ.100 విలువైన షేర్లు తాకట్టు పెడితే బ్యాంక్ వాటిని రూ.60గా మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో బ్రోకర్లు అదే స్థాయి రుణం పొందేందుకు మరిన్ని ఎక్కువ షేర్లు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. బ్రోకరేజ్ సంస్థలు తమ సొంత నిధులతో మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడాన్ని ప్రొప్రైటరీ ట్రేడింగ్ అంటారు. కొత్త నిబంధన ప్రకారం బ్యాంకులు ఇకపై బ్రోకర్ల ప్రొప్రైటరీ ట్రేడింగ్‌కు నిధులు ఇవ్వకూడదు. దీని వల్ల బ్రోకర్లు తమ కస్టమర్ల సేవలు, తమ సొంత ట్రేడింగ్ కార్యకలాపాల మధ్య స్పష్టమైన విభజన పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా F&O సెగ్మెంట్‌లో అప్పుగా తీసుకున్న డబ్బుతో రిస్క్ తీసుకునే అవకాశం ఇక ఉండదు.
ఎంటీఎఫ్ వడ్డీ రేట్లు, బ్రోకరేజ్ చార్జిలు పెరుగుతాయా..?
ఈ మార్పులపై బ్రోకర్ కమ్యూనిటీ సోషల్ మీడియాలో చురుకుగా స్పందిస్తోంది. ముఖ్యంగా 25 శాతం క్యాష్ నిబంధన క్యాష్ ట్రాప్ సృష్టించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 40 శాతం హెయిర్‌కట్ కారణంగా కొన్ని సంస్థలు తమ షేర్లను అమ్మాల్సి రావచ్చని కూడా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లెవరేజ్ ముగింపు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మార్పులు ప్రధానంగా సంస్థాగత రుణాలపై దృష్టి సారించినప్పటికీ సాధారణ పెట్టుబడిదారులపై కూడా పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్రోకర్లపై మూలధన ఒత్తిడి పెరగడంతో వారి వ్యాపార ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చులను వారు వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ఫలితంగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (MTF)పై వడ్డీ రేట్లు పెరగడం లేదా బ్రోకరేజ్ ఛార్జీలలో మార్పులు రావడం జరుగుతుంది. అయితే ఈ కొత్త RBI నియమాలు మార్కెట్‌ను మరింత సురక్షితంగా మార్చే దిశగా ఉన్నప్పటికీ తక్షణమే లిక్విడిటీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. మరి బ్రోకర్లు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026

Nithin Kamath | బ్రోకరేజీ సంస్థలకు జీరోధా నితిన్ కామత్ హెచ్చరిక.. ఎంటీఎఫ్లపై అంత ఎక్స్పోజర్ వద్దు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



