Kerala | 10 గంటలకు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. 20 మంది మంత్రులు కూడా..
Kerala | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాల తర్వాత కేరళలో (Kerala) ఎట్టకేలకు ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ (V D Satheesan) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Kerala | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాల తర్వాత కేరళలో (Kerala) ఎట్టకేలకు ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ (V D Satheesan) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా (UDF Cabinet) ప్రమాణం చేస్తారు. ఉదయం 10 గటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. దీంతో 60 ఏండ్ల తర్వాత మొత్తం మంత్రిమండలి మొత్తం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి.
సీఎంతోపాటు 21 మంది మంత్రుల్లో 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారుకాగా, మిగిలినవారు యూడీఎఫ్‌లో భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు. అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే తిరువంచూర్ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ హాజరు కానున్నారు.
చారిత్రక విజయం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి చారిత్రక విజయం సాధించి. 102 స్థానాలతో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మాజీ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) కూటమి 35 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.
సతీశన్ గురించి..
సతీశన్ పూర్తిపూర్తి పేరు వడశేరి దామోదరన్ సతీశన్ నెట్టూరు. 1964, మే 31న ఎర్నాకుళం జిల్లాలో జన్మించారు. పనంపిల్లి నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. తేవరలోని సేక్రేడ్ హార్ట్ కళాశాలలో అండర్-గ్రాడ్యుయేషన్ చదివారు. ఆ తర్వాత కేరళ లా అకాడమీ నుంచి ఎల్.ఎల్.బి (LL.B), గవర్నమెంట్ లా కాలేజీ నుంచి ఎల్.ఎల్.ఎం (LL.M) పూర్తి చేశారు. అంతేకాకుండా సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ (MSW) కూడా పొందారు.
విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ (KSU) మరియు ఎన్.ఎస్.యూ.ఐ (NSUI)లో కీలక బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాల్లోకి రాకముందు 10ఏళ్ల పాటు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.
వరుసగా ఆరోసారి
సతీశన్ ఎర్నాకుళం జిల్లాలోని పరావూర్ (Paravur) నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన కమ్యూనిస్ట్ కోటగా ఉన్న పరాపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ అభ్యర్థి పీ. రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి కేరళ అసెంబ్లీకి తొలిసారిగా అడుగుపెట్టారు. అప్పటి ఓటమి అనేదే లేకుండా వరుసగా ఆరుసార్లు 2001, 2006, 2011, 2016, 2021, 2026 అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
2021లో రమేశ్ చెన్నితాల స్థానంలో సతీశన్ ను కేరళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూ అనేక పోరాటాలు చేసిన సతీశన్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






