త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kedarnath | కేదార్‌నాథ్ ఆల‌య త‌లుపులు మూసివేత.. ఉఖీమఠ్‌కు బయ‌ల్దేరిన ఉత్స‌వ ప‌ల్ల‌కి

Kedarnath | శీతాకాలం (Winter) సందర్భంగా దేవభూమి ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామ్‌ (Sri Kedarnath Dham) ఆల‌య త‌లుపుల‌ను అధికారులు మూసివేశారు. ఆర్మీ బ్యాండ్ వాయిద్యాలు, వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య ఉదయం స‌రిగ్గా 8:30 గంటలకు ఆలయ ద్వారాలను క్లోజ్ చేశారు.

D

National | Published On Nov 11, 2026, 4.02 pm IST

Kedarnath | కేదార్‌నాథ్ ఆల‌య త‌లుపులు మూసివేత.. ఉఖీమఠ్‌కు బయ‌ల్దేరిన ఉత్స‌వ ప‌ల్ల‌కి
Advertisement

Kedarnath | త్రినేత్ర న్యూస్ : శీతాకాలం (Winter) సందర్భంగా దేవభూమి ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామ్‌ (Sri Kedarnath Dham) ఆల‌య త‌లుపుల‌ను అధికారులు మూసివేశారు. బుధ‌వారం ఉద‌యం 8.30 నిమిషాల‌కు వేద మంత్రాల మ‌ధ్య ఆల‌యానికి తాళం వేశారు. ఉద‌యం 4 గంట‌ల‌కే ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌య త‌లుపులు మూసివేయ‌డానికి ముందు సంప్ర‌దాయ ఆచారాల ప్ర‌కారం అన్ని పూజా క్ర‌తువుల‌ను నిర్వ‌హించారు. ఆర్మీ బ్యాండ్ వాయిద్యాలు, వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య ఉదయం స‌రిగ్గా 8:30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు.

అనంతరం బాబా కేదార్ పంచముఖి ఉత్సవ పల్లకీ ఊరేగింపుగా శీతాకాల విడిది అయిన ఉఖీమఠ్ (Ukhimath)లోని ఓంకారేశ్వర ఆలయానికి బయలుదేరింది. ఈ పల్లకీ బుధవారం రాత్రి రాంపూర్‌లో బ‌స చేసిన త‌ర్వాత నవంబర్ 12న గుప్తకాశీకి చేరుకుంటుంది. ఆ త‌ర్వాత నవంబర్ 13న ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి చేరుకుంటుంది. రాబోయే ఆరు నెల‌ల పాటూ భ‌క్తులు ఓం కారేశ్వ‌ర్ ఆల‌యంలోనే ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించుకోవ‌చ్చు.

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్ థామ్‌ను సంద‌ర్శిస్తుంటారు. పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా కేదార్‌నాథ్ (Kedarnath) ఆల‌య త‌లుపులు ఏప్రిల్ 22న తెరుచుకున్న విష‌యం తెలిసిందే.

ఇప్పటివరకు 19.20 లక్షలకు పైగా భక్తులు కేదారేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్నారు. ఇక శీతాకాలం ప్రారంభం కావ‌డంతో ఆల‌య త‌లుపుల‌ను మూసివేశారు. శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. వచ్చే ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి.

Also Read..

సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్ర‌దాడి

టేకాఫ్‌కు ముందు.. ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ అల‌ర్ట్‌

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి 10+2 విధానం అమ‌లు : సీఎం రేవంత్ రెడ్డి

Advertisement
Advertisement