త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి 10+2 విధానం అమ‌లు : సీఎం రేవంత్ రెడ్డి

Telangana | రాష్ట్రంలో వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి 10+2 విధానం అమ‌లుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యాశాఖ అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. న‌ర్స‌రీ నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్య‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని చెప్పారు.

S

Telangana | Published On Nov 11, 2026, 3.56 pm IST

Telangana | వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి 10+2 విధానం అమ‌లు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Telangana | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి 10+2 విధానం అమ‌లుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యాశాఖ అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. న‌ర్స‌రీ నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్య‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని చెప్పారు. విద్యాశాఖ‌పై బుధ‌వారం జ‌రిగిన స‌మీక్ష సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సిందే. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన. నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 12వ తరగతి నుంచి నైపుణ్యంపై దృష్టి పెడుతున్నాం. 9 నుంచి 12 వ తరగతి వరకు ఉన్నత విద్యగా పరిగణించి ప్రత్యేక విద్యను అందించాలి. తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిందే. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోండి. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement