Kedarnath | రేపు కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మూసివేత!
Kedarnath | భక్తుల శివనామస్మరణతో మార్మోగిన కేదార్‌నాథ్ ధామ్ యాత్రా సీజన్ ముగింపు దశకు చేరుకుంది. శీతాకాలం నేపథ్యంలో ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను బుధవారం (నవంబర్ 11) ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నారు. ఈ మేరకు మంగళవారం బాబా కేదార్ ఉత్సవ డోలీ ఆలయంలోకి ప్రవేశించింది.
Devotional | Published On Nov 10, 2026, 6.47 pm IST
- బాబా కేదార్ ఉత్సవ డోలీ ఆలయంలోకి ప్రవేశం..
- ఉదయం 8.30 గంటలకు ద్వారాలు బంద్
- ఈ ఏడాది 19 లక్షలకు చేరువలో భక్తుల దర్శనాలు..
- ఊఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్లనున్న బాబా కేదార్
Kedarnath | భక్తుల శివనామస్మరణతో మార్మోగిన కేదార్‌నాథ్ ధామ్ యాత్రా సీజన్ ముగింపు దశకు చేరుకుంది. శీతాకాలం నేపథ్యంలో ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను బుధవారం (నవంబర్ 11) ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నారు. ఈ మేరకు మంగళవారం బాబా కేదార్ ఉత్సవ డోలీ ఆలయంలోకి ప్రవేశించింది. భాయీ దూజ్ సందర్భంగా సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు. అనంతరం బాబా కేదార్ ఉత్సవ డోలీని శీతాకాల విడిది కేంద్రం ఊఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించనున్నారు. అక్కడే శీతాకాలం మొత్తం భక్తులకు స్వామివారి దర్శనమిస్తారు.
ఏప్రిల్ 22న తెరుచుకున్న ద్వారాలు
2026 యాత్రా సీజన్ కోసం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరిచారు. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఏడాది నవంబర్ 5 నాటికి ఏకంగా 18,95,701 మంది భక్తులు బాబా కేదార్‌ను దర్శించుకున్నట్లుగా అంచనా. అంటే ఇప్పటికే సుమారు 19 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. చివరి వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలయ ద్వారాల మూసివేత కార్యక్రమం నేపథ్యంలో రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ విశాల్ మిశ్రా మంగళవారం కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకున్నారు. ఆలయ పరిసరాలు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, వసతి, వైద్య సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు.
భద్రతకు పెద్దపీట
ద్వారాల మూసివేత కార్యక్రమానికి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. రద్దీ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య, విపత్తు నిర్వహణ, రోడ్లు, తాగునీరు, విద్యుత్, మున్సిపల్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా యంత్రాంగం సూచించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వేడుకను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం బాబా కేదార్ ఉత్సవ డోలీ తన శీతాకాల విడిది కేంద్రానికి బయలుదేరనుంది. మార్గమధ్యంలోని రాంపూర్, ఫాటా, నారాయణ్‌కోటి, గుప్తకాశీ మీదుగా ప్రయాణించి నవంబర్ 13న ఊఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి చేరుకోనుంది. అక్కడ శీతాకాల పూజలు కొనసాగనున్నాయి. వచ్చే ఏడాది మళ్లీ వేసవి యాత్రా సీజన్‌లో కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nitesh Tiwari Ramayana | రావణుడి సింహాసనానికి రూ.కోటి.. శూర్పణఖ రథానికి రూ.1.5 కోట్లు: కళ్లు చెదిరేలా 'రామాయణ' సెట్స్ విశేషాలు
- ●Garima Agarwal | సత్యారెడ్డి లెక్క సాగు చేయండి.. ఆయన్ను ఆదర్శంగా తీసుకోండి
- ●Land Resurvey | భూ రీసర్వేలో మరో మైలురాయి..
- ●Hyderabad Cloud Kitchens Raid | ఛీ.. యాక్ : ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ముందు ఇది చదవండి
- ●Charlapalli–Tiruchanur Train | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి – తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ ఇక సూపర్‌ఫాస్ట్!
- ●Borewell drilling | బోరుబావులు తవ్వేందుకు 300 అడుగుల వరకు అనుమతివ్వాలి

Nitesh Tiwari Ramayana | రావణుడి సింహాసనానికి రూ.కోటి.. శూర్పణఖ రథానికి రూ.1.5 కోట్లు: కళ్లు చెదిరేలా 'రామాయణ' సెట్స్ విశేషాలు

Garima Agarwal | సత్యారెడ్డి లెక్క సాగు చేయండి.. ఆయన్ను ఆదర్శంగా తీసుకోండి

Land Resurvey | భూ రీసర్వేలో మరో మైలురాయి..

Hyderabad Cloud Kitchens Raid | ఛీ.. యాక్ : ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ముందు ఇది చదవండి




