Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు..
Gold And Silver Prices Today | అమెరికా బాండ్ మార్కెట్లలో పెరిగిన రాబడి కారణంగా అంతర్జాతీయ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు, బులియన్ మార్కెట్లపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో గత సెషన్‌లో పెట్టుబడిదారులు భారీ ఎత్తున అమ్మకాలు చేపట్టారు. బులియన్ మార్కెట్లలోనూ భారీగా ధరల తగ్గుదల చోటు చేసుకుంది.
Gold And Silver Prices Today | అమెరికా బాండ్ మార్కెట్లలో పెరిగిన రాబడి కారణంగా అంతర్జాతీయ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు, బులియన్ మార్కెట్లపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో గత సెషన్‌లో పెట్టుబడిదారులు భారీ ఎత్తున అమ్మకాలు చేపట్టారు. బులియన్ మార్కెట్లలోనూ భారీగా ధరల తగ్గుదల చోటు చేసుకుంది. అయితే శుక్రవారం సెషన్‌లో మాత్రం స్వల్పంగా ఊరట లభించింది. అయినప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. కానీ దేశీయ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర ఈ సెషన్‌లో 0.29 శాతం తగ్గి 4,261 డాలర్లకు చేరగా, వెండి ధర 0.66 శాతం తగ్గి 63 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 176 పాయింట్లు తగ్గి 1,50,560 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 602 పాయింట్లు తగ్గి 2,32,880 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,284 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,22, 272 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,840 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,28,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,600 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,010 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,12,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,40,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,01,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,463 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,704గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,630 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,46,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.15వేలు తగ్గిన పసిడి ధర.. ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక..
సెప్టెంబర్ 24, 2026

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. జాగ్రత్త అంటున్న నిపుణులు..
సెప్టెంబర్ 23, 2026

Gold Price | బంగారం ధరలకు భారీ బూస్ట్.. రూ.3 లక్షలు దాటే ఛాన్స్?
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
- ●YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..
- ●Balapur Laddu | రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి
- ●PB Fintech | పాలసీబజార్ షేర్లలో మళ్లీ ఊగిసలాట.. బ్రోకరేజీల రేటింగ్ ఎటువైపు..?
- ●Danam Nagender | ఖైరతాబాద్ మహాగణపతి ఎదుట దానం నాగేందర్ డ్యాన్స్..
- ●Stock Markets | షార్ప్ పతనం తర్వాత మార్కెట్లకు ఊరట.. సెన్సెక్స్ 173 పాయింట్లు అప్..

Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు

YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..

Balapur Laddu | రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

PB Fintech | పాలసీబజార్ షేర్లలో మళ్లీ ఊగిసలాట.. బ్రోకరేజీల రేటింగ్ ఎటువైపు..?



