త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyank Kharge | నిబంధ‌న‌ల ప్ర‌కారం జ‌రిగుంటే.. ఆ 16 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌ వివ‌రాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?

Priyank Kharge | యూపీ (Uttar Pradesh) ఓట‌ర్ల జాబితా నుంచి (Uttar Pradesh electoral roll) 16 ల‌క్షల మంది కొత్త ఓట‌ర్ల వివ‌రాలు అందుబాటులో లేక‌పోవ‌డంపై క‌ర్ణాట‌క హోం మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే (Priyank Kharge) తాజాగా స్పందించారు. అన్నీ స‌క్ర‌మంగా, నిబంధ‌న‌ల ప్ర‌కారం జ‌రిగి ఉంటే వివ‌రాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు..? అంటూ ప్ర‌శ్నించారు.

D

National | Published On Oct 6, 2026, 3.18 pm IST

Priyank Kharge | నిబంధ‌న‌ల ప్ర‌కారం జ‌రిగుంటే.. ఆ 16 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌ వివ‌రాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?
Advertisement

Priyank Kharge | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఓట‌ర్ల జాబితా నుంచి 16 ల‌క్షల మంది కొత్త ఓట‌ర్ల వివ‌రాలు అందుబాటులో లేక‌పోవ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ వ్య‌వ‌హారంపై క‌ర్ణాట‌క హోం మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే (Priyank Kharge) తాజాగా స్పందించారు. స‌ర్ ప్ర‌క్రియ‌కు ముందు రాష్ట్రంలో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉన్నార‌ని తెలిపారు. ముసాయిదా జాబితా త‌ర్వాత 2.89 కోట్ల పేర్లు తొల‌గించార‌ని చెప్పారు. ఆ త‌ర్వాత 84.30 లక్షల మంది ఓట‌ర్లను చేర్చార‌ని వివ‌రించారు. అయితే, అందులో 71.38 లక్షల మంది వివ‌రాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌న్నారు.

ఎన్నికల సంఘం (ECI) పేర్కొన్న అదనపు 16.18 లక్షల ప్రీ-డ్రాఫ్ట్ ఫారం-6 దరఖాస్తుల వివరాలు మాత్రం బహిరంగంగా అందుబాటులో లేవ‌న్నారు. "కొత్త‌గా చేర్చిన ఆ 16.18 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుదారులు ఎవ‌రు..? వారి పేర్ల‌ను ఎక్క‌డ చేర్చారు..? ఆ ద‌ర‌ఖాస్తుల‌ను ఎవ‌రు ప‌రిశీలించారు. ఫారం-6 రికార్డులు, ఈఆర్ఓ (ERO) ఉత్తర్వులు ఎక్కడ..? ఎన్నిక‌ల సంఘం చ‌ట్టాన్ని పాటించిందా అన్న‌దే ఇక్క‌డ పెద్ద ప్ర‌శ్న‌. అన్నీ స‌క్ర‌మంగా, నిబంధ‌న‌ల ప్ర‌కారం జ‌రిగి ఉంటే వివ‌రాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు..? ఆ వివ‌రాలు బ‌హిర్గ‌తం చేయండి" అంటూ నిల‌దీశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

Also Read..

యూపీ ఓట‌రు లిస్టులో కొత్త‌గా చేర్చిన ఆ 16 ల‌క్ష‌ల మంది ఎవ‌రు..?

కెప్టెన్సీకి గుడ్‌బై.. హ‌ర్మ‌న్‌ప్రీత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

చిన్నారుల సంర‌క్ష‌ణ‌లో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర కీల‌కం

Advertisement
Advertisement