Ramchandar Rao | చిన్నారుల సంరక్షణలో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర కీలకం
Ramchandar Rao | చిన్నారుల సంరక్షణలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల పాత్ర అత్యంత కీలకమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. అరకొర వేతనాలు ఉన్నప్పటికీ వారు అందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: చిన్నారుల సంరక్షణలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల పాత్ర అత్యంత కీలకమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. అరకొర వేతనాలు ఉన్నప్పటికీ వారు అందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు. వారి నిస్వార్థ సేవలను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ వారిని సముచితంగా గౌరవించాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా చిన్నారుల సంక్షేమం, మహిళా సాధికారతకు తోడ్పడేలా ‘అంగన్ మిలాన్ సేవా అభియాన్’ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మల్కాజ్‌గిరిలోని బిహార్ బస్తీలో అంగన్‌వాడీ పిల్లలు, కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సేవా కార్యక్రమం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా మల్కాజ్‌గిరిలో ‘అంగన్ మిలాన్ సేవా అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించాం. చిన్నారులు, అంగన్‌వాడీ టీచర్లతో ముచ్చటించాను. చిన్నారుల ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి పౌష్టికాహారాన్ని అందజేయడంతో పాటు, చదువులో వారు మరింత ముందంజలో ఉండాలనే లక్ష్యంతో స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఇతర అవసరమైన విద్యా సామగ్రిని అందజేశాం. మోదీ స్ఫూర్తితోనే ఈరోజు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సత్కరించాం. వారి సంక్షేమానికి బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని రాంచందర్‌రావుపేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, బస్తీ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●MP Chamala | జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
- ●HMWSSB | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!
- ●Stock Markets | జీడీపీ పెరుగుతున్నా.. భారత స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి..?
- ●Malayalam OTT | టాలీవుడ్ హీరోయిన్ మలయాళం థ్రిల్లర్ మూవీ - ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్
- ●UP SIR | యూపీ ఓటరు లిస్టులో కొత్తగా చేర్చిన ఆ 16 లక్షల మంది ఎవరు..?
- ●B Vinod Kumar | రామప్ప ఆలయం దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఓప్పుకోం

MP Chamala | జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

HMWSSB | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!

Stock Markets | జీడీపీ పెరుగుతున్నా.. భారత స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి..?

Malayalam OTT | టాలీవుడ్ హీరోయిన్ మలయాళం థ్రిల్లర్ మూవీ - ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్







