Kalvakuntla Kavita | కడిగిన ముత్యంలా వస్తానని ఆనాడే చెప్పా.. లిక్కర్ పాలసీ కేసులో కోర్టు తీర్పుపై కవిత
Kalvakuntla Kavita | ఢిల్లీ మద్యం కుంభకోణం కోసు (Delhi Liquor Policy Case)లో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavita) స్పందించారు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మొదట్నుంచీ చెబుతూ వచ్చానని.. అదే ఇప్పుడు జరిగిందని పేర్కొన్నారు.
Kalvakuntla Kavita | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. ఈ కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులందరిపై నమోదైన కేసులను కొట్టేసింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavita) సహా 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది.
కేసు తీర్పుపై కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మొదట్నుంచీ చెబుతూ వచ్చానని.. అదే ఇప్పుడు జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో విలేకరులతో కవిత మాట్లాడారు. కేవలం అది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని తెలిపారు. ఆ సమయంలో తాను, తన కుటుంబం ఎంతో క్షోభను అనుభవించినట్లు చెప్పుకొచ్చారు. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పు రాకుండానే తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పాను. అది కోర్టు తీర్పుతో నిరూపితమైంది. ఈ కేసు వల్ల నేను నా కుటుంబం ఐదున్నర నెలలపాటు మానసిక క్షోభను అనుభవించాము. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేందుకే ఈ కేసు పెట్టారు. తెలంగాణ ప్రజలకు నేను మొదటి నుంచి ఈ కేసులో నా పాత్ర లేదని చెప్పాను. న్యాయవ్యవస్థ పైన నేను పెట్టుకున్న నమ్మకం నిలబడింది. నేను జైల్లో ఉన్న సమయంలో అనేకసార్లు ఢిల్లీకి విమాన టికెట్లు పెట్టుకొని మరి అభిమానులు వచ్చారు. ఈ కేసులో క్లీన్ చిట్ రాగానే మా అమ్మతో ఫోన్ లో మాట్లాడాను" అని కవిత తెలిపారు. ఈ సందర్భంగా కష్టకాలంతో తనకు అండగా నిలిచిన వారందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు.
కాగా, మద్యం కుంభకోణం ఆరోపణలతో 2024 మార్చిలో కవితను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న విచారణ పేరుతో హైదరాబాద్‌లోని కవిత ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు.. ఆమెను కొన్ని గంటలపాటూ ప్రశ్నించారు. అదే రోజు రాత్రి అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. దాదాపు నాలుగు నెలలపాటూ జైల్లోనే ఉన్నారు. 2024 ఆగస్టు 27న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
కోర్టు కీలక తీర్పు..
దేశ రాజకీయాలను కుదిపేసిన మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మద్యం పాలసీలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఢిల్లీ కోర్టు తేల్చింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర కానీ, నేరపూరిత ఉద్దేశం కానీ లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేసులో నిందితులందరిపై నమోదైన కేసులను కొట్టేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నకేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది.
సీబీఐపై ఆగ్రహం..
ఈ సందర్భంగా సీబీఐపై కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలున్నాయని పేర్కొంది. ఈ కేసులో ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు కోర్టు తెలిపింది. చార్జ్‌షీట్‌లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలు ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సీబీఐ సమర్పించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది.
లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో సిసోడియా పాత్ర ఉన్నట్లు చూపించే ఎలాంటి ఆధారాలు లేవని, ఆయన వద్ద నుంచి ఎలాంటి రికవరీ జరగలేదని కోర్టు తెలిపింది. అంతేకాదు, కేజ్రీవాల్‌ను కూడా సరైన ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించారని పేర్కొంది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు మోపడం చట్టపరమైన ప్రమాణాలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. మౌలిక ఆధారాలు లేకుండా కుట్రలో ఆయన పాత్రను నిర్ధారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్‌పై కూడా ఎలాంటి స్పష్టమైన ఆధారాలూ లేవని, అయినప్పటికీ ఆయనను మొదటి నిందితుడిగా చేర్చడం ఆశ్చర్యకరమని కోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణకు కోర్టు ఆదేశించింది.
Also Read..
Cheetah Meals | చీతాలకు ఆహారంగా మేకలు.. ఏడాదికి రూ.1.27 కోట్ల ఖర్చు
Google Nano Banana 2 | నానో బనానా 2 వచ్చేసింది.. ఇకపై మరింత వేగంగా ఇమేజ్‌ల జనరేషన్..
సంబంధిత వార్తలు

Excise Scam Case | కోర్టు ధిక్కరణ కేసు.. ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు తాఖీదులు..
మే 19, 2026

Kalvakuntla Kavita | నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ.. పార్టీ శ్రేణులకు కవిత పిలుపు
మే 11, 2026

Arvind Kejriwal | సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్.. మద్యం పాలసీ కేసు మరో బెంచ్‌కు ఇవ్వాలని..!
మార్చి 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



