Google Nano Banana 2 | నానో బనానా 2 వచ్చేసింది.. ఇకపై మరింత వేగంగా ఇమేజ్‌ల జనరేషన్..
Google Nano Banana 2 | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్ నానో బనానా 2ను రిలీజ్ చేసింది. గూగుల్ జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌లో నానో బనానా మోడల్ ఇప్పటికే అందుబాటులో ఉండగా దానికి అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా నానో బనానా 2ను విడుదల చేసినట్లు తెలిపింది.
Technology | Published On Feb 27, 2026, 12.06 pm IST
Google Nano Banana 2 | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్ నానో బనానా 2ను రిలీజ్ చేసింది. గూగుల్ జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌లో నానో బనానా మోడల్ ఇప్పటికే అందుబాటులో ఉండగా దానికి అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా నానో బనానా 2ను విడుదల చేసినట్లు తెలిపింది. గత మోడల్ కన్నా నూతన మోడల్ మరింత వేగంగా పనిచేస్తుందని, ఇమేజ్‌లను వేగంగా జనరేట్ చేస్తుందని గూగుల్ తెలియజేసింది. గూగుల్ ఏఐ ప్రొ సాంకేతికతతోపాటు జెమిని ఫ్లాష్‌ను మిళితం చేసి నానో బనానా 2 ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను అభివృద్ధి చేశామని ఆ సంస్థ తెలిపింది. నానో బనానా 2 మోడల్‌లో యూజర్లు వేగంగా ఇమేజ్‌లను క్రియేట్ లేదా జనరేట్ చేసుకోవచ్చు. మెరుగైన టెక్ట్స్ రెండరింగ్ లభిస్తుంది. ఇంకా అనేక ఇతర ఫీచర్లు లభిస్తున్నాయని గూగుల్ తెలిపింది. ఈ నూతన మోడల్ ప్రస్తుతం యూజర్లకు అందుబాటులో ఉందని గూగుల్ వివరించింది.
మరింత మెరుగ్గా టెక్ట్స్ రెండరింగ్..
ఏఐ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చాలా సంస్థలు తమ ఏఐ టూల్స్‌కు మరిన్ని మెరుగులు దిద్దుతున్నాయి. యూజర్లు ఆయా టూల్స్‌ను సులభంగా, వేగంగా ఉపయోగించుకునేలా రూపొందిస్తున్నాయి. పోటీతత్వం పెరగడంతో సంస్థలు అధునాతన ఫీచర్లను అందించడంలో పోటీపడుతున్నాయి. ఇక గూగుల్ కూడా ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా ఈ నూతన ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను అభివృద్ది చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇందులో యూజర్లు ఇమేజ్‌లపై టెక్ట్స్‌ను కూడా మరింత స్పష్టంగా కనిపించేలా జనరేట్ చేసుకోవచ్చు. నానో బనానా 2 మోడల్ యూజర్ అప్‌లోడ్ చేసే ఇమేజ్‌లను కూడా మరింత స్పష్టంగా గుర్తించగలుగుతుంది. అలాగే ఎన్నిసార్లు జనరేట్ చేసినా ఫొటోల్లో ఉండే వస్తువులు, వ్యక్తులు అన్ని ఇమేజ్‌లలోనూ ఒకేలా కనిపిస్తారు. ఎలాంటి మార్పు ఉండదు.
నానో బనానా 2 మోడల్ ద్వారా యూజర్లు 4కె రిజల్యూషన్ ఉన్న ఇమేజ్‌లను జనరేట్ చేయవచ్చు. కనీసం 512 పిక్సల్స్ ఉన్న ఇమేజ్‌లను కూడా ఇందులో సృష్టించవచ్చు. అత్యంత బ్రైట్‌నెస్, స్పష్టత ఉండేలా ఇమేజ్‌లు జనరేట్ అవుతాయి. నానో బనానా 2 కోసం సింథ్ ఐడీ టెక్నాలజీని వాడుతున్నామని గూగుల్ తెలిపింది. ఈ కొత్త మోడల్‌ను 141 దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






