Excise Scam Case | కోర్టు ధిక్కరణ కేసు.. ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు తాఖీదులు..
Excise Scam Case | ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పలువురు నేతలకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారానికి సంబంధించిన సుమోటో క్రిమినల్ కాంటెంప్ట్ కేసులో భాగంగా తాఖీదులు పంపింది.
Excise Scam Case | ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పలువురు నేతలకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారానికి సంబంధించిన సుమోటో క్రిమినల్ కాంటెంప్ట్ కేసులో భాగంగా తాఖీదులు పంపింది. జస్టిస్ స్వరణకాంత శర్మ సుమోటోగా ప్రారంభించిన క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జస్టిస్ స్వరణకాంత శర్మను కోర్టు నుంచి తమ రిక్యూసల్ పిటిషన్‌ను ఏప్రిల్ 20న తిరస్కరించిన తర్వాత ఆప్ నేతలు కోర్టు విచారణను బహిష్కరించడంతో పాటు సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, లేఖలతో న్యాయమూర్తిపై అవమానకరంగా, పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి.
ప్రస్తుతం ఈ కేసును జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ రవీంద్ర దుదేజాతో కూడిన ద్విసభ్య ధర్మాససం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురు నేతలకు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో అమికస్ క్యూరీని సైతం నియమించిన కోర్టు.. సంబంధిత ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని స్పష్టం చేసింది. విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. ఆప్ నేతలు న్యాయమూర్తి నిష్పక్షపాతాన్ని ప్రశ్నించడమే కాకుండా గౌరవాన్ని దెబ్బతీసేలా దుర్భాషలాడారని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఈ వ్యవహారంపై సైతం జస్టిస్ స్వరణకాంత శర్మ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి ఊరట పొందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తనపై, కోర్టుపై అవమానకరంగా, ద్వేషపూరిత, పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాను మౌనం పాటించలేనని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






