KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : కేబీఆర్ పార్క్‌ను కాపాడాలని.. పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు గురువారం కేటీఆర్‌ని కలిశారు. ఈసందర్భంగా ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా చెట్లను నరికివేసే ప్రయత్నాలను వ్యతికించాలని, హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
కేబీఆర్ పార్క్.. హైదరాబాద్‌కి లంగ్స్ స్పేస్
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి అత్యంత విలువైన "లంగ్స్ స్పేస్" అని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో కేబీఆర్ పార్క్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇలాంటి పచ్చదనాన్ని నాశనం చేసే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబీఆర్ పార్క్ ఉనికి, చెట్లకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా అండర్‌గ్రౌండ్ ప్రతిపాదికన ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ ప్రణాళికలు ఇప్పటికీ మున్సిపల్ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేయడం సరైన విధానం కాదని, సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేయవచ్చని పేర్కొన్నారు.
పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత
కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తు తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించాలంటే కేబీఆర్ పార్క్ వంటి పర్యావరణ సంపదలను కాపాడుకోవడం అత్యవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు.
View this post on Instagram
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్
- ●Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ - లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



