త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై భారతీయ చేనేత జిగేల్మంది. పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ చేసిన చరిత్రాత్మక ఎంట్రీ విశేషాలివే.

J

Entertainment | Published On May 21, 2026, 7.46 pm IST

Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్
Advertisement

Rashmi Thakur Cannes 2026 | త్రినేత్ర.న్యూస్ : ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival 2026)లో భారతీయ చేనేత ఖ్యాతి గ్లోబల్ లెవల్‌లో మార్మోగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య.. మన దేశపు సాంస్కృతిక రాయబారిగా రష్మీ ఠాకూర్ గురువారం (మే 21) అడుగుపెట్టి చరిత్రాత్మక అరంగేట్రం చేశారు.

వెస్ట్రన్ వేదికపై 'లోకల్' మ్యాజిక్

అందరూ వెస్ట్రన్ డిజైనర్ వేర్‌తో వస్తుంటే.. రష్మీ మాత్రం అచ్చమైన తెలంగాణ బ్రాండ్‌తో రెడ్ కార్పెట్ (Red carpet) పై సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తెలంగాణ మాస్టర్ నేతన్నలు ఎంతో ప్రతిభతో చేతితో నేసిన 200 సంవత్సరాల నాటి పురాతన డిజైన్ 'పోచంపల్లి ఇక్కత్' (Pochampally Ikat) కూచర్ దుస్తులను ఆమె ధరించారు. మన GI-ట్యాగ్ ఉన్న ఈ చేనేత వస్త్రాలను "పోచంపల్లి టు కేన్స్" అనే థీమ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై ప్రదర్శించడం ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Rashmi Thakur Shines at Cannes 2026 in Pochampally Ikat and Pearls

నిజాం కాలం నాటి ముత్యాలతో

ఈ అద్భుతమైన ఇక్కత్ డ్రెస్‌కి మరింత గ్లామర్ తీసుకొచ్చింది ప్రఖ్యాత 'హైదరాబాదీ ముత్యాలు'. నిజాంల కాలం నాటి పాతకాలపు హెరిటేజ్ జువెలరీతో రష్మీ తన లుక్‌ను స్టైల్ చేశారు. ఇక్కత్ నేతలోని జియోమెట్రిక్ డిజైన్‌కు, ఈ రాయల్ ముత్యాల కలయిక ఫ్యాషన్ వరల్డ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దేశీయ వస్త్ర వారసత్వం, రాజస ఉట్టిపడే ఆభరణాల మధ్య ఉన్న ఈ కాంబినేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Rashmi Thakur Shines at Cannes 2026 in Pochampally Ikat and Pearls

నా ఎంట్రీ కాదు.. తెలంగాణ ఎంట్రీ

కేన్స్ వేదికపై తన ఎక్స్‌పీరియన్స్ గురించి రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ.. “రెడ్ కార్పెట్‌పై నడవడం కేవలం నా అరంగేట్రం మాత్రమే కాదు, ఇది తెలంగాణ అరంగేట్రం. 200 ఏళ్ల చరిత్రను తమ దారాల్లో అల్లిన మన పోచంపల్లి నేతన్నలందరికీ ఇది అంకితం. మన చేనేతను, హైదరాబాదీ ముత్యాలతో కలిపి ప్రపంచానికి చూపించడం మన హస్తకళలకు నేను ఇస్తున్న ఘనమైన నివాళి,” అని ఎమోషనల్ అయ్యారు.

Rashmi Thakur Shines at Cannes 2026 in Pochampally Ikat and Pearls

మే 13 నుంచి 24 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో.. రష్మీ ప్రెజెన్స్ భారతీయ చేనేతను, ట్రెడిషనల్ ఫ్యాషన్‌ను గ్లోబల్ లగ్జరీ మ్యాప్‌లో టాప్‌లో నిలబెట్టిందని ఫ్యాషన్ క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు.

Advertisement
Advertisement