త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వ‌చ్చింది – రీఎంట్రీపై వ‌డ్డే న‌వీన్ కామెంట్స్‌

పెళ్లి, కోరుకున్న ప్రియుడు, ప్రియా ఓ ప్రియా వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన వ‌డ్డే న‌వీన్ ప‌దేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తోన్నాడు. అత‌డు హీరోగా న‌టించిన ట్రాన్స్‌ప‌ర్ త్రిమూర్తులు మూవీ జూన్ 19న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On May 21, 2026, 8.10 pm IST

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వ‌చ్చింది – రీఎంట్రీపై వ‌డ్డే న‌వీన్ కామెంట్స్‌
Advertisement

Vadde Naveen | ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో ఫ్యామిలీ క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు హీరో వ‌డ్డే న‌వీన్‌, పెళ్లి, కోరుకున్న ప్రియుడు, ప్రియా ఓ ప్రియా వంటి సూప‌ర్ హిట్‌ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. 2016లో వ‌చ్చిన ఎటాక్ త‌ర్వాత ప‌రాజ‌యాల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. దాదాపు ప‌దేళ్ల లాంగ్ గ్యాప్‌ త‌ర్వాత ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు మూవీతో మ‌ళ్లీ హీరోగా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు వ‌న్డే న‌వీన్‌. పోలీస్ క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను వ‌డ్డే న‌వీన్ స్వ‌యంగా నిర్మిస్తున్నారు.

జూన్ 19న రిలీజ్‌...

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాకు కమల్ తేజ నార్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాశీ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.
ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నారు. గురువారం నాడు మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో త్రిమూర్తులు అనే కానిస్టేబుల్ పాత్ర‌లో వ‌డ్డే న‌వీన్ క‌నిపించారు. ప‌దేళ్ల‌లో 55 ట్రాన్స్‌ఫ‌ర్‌లు ఎదుర్కొన్న త్రిమూర్తులు చివ‌ర‌కు పోలీసుల‌కే మోస్ట్ వాంటెడ్‌గా ఎందుకు మారాడ‌నే అంశాల‌తో ఈ టీజ‌ర్ ఆస‌క్తిని రేకెత్తించింది. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, క్రైమ్ అంశాల‌తో టీజ‌ర్‌ను క‌ట్ చేశారు.

హైద‌రాబాద్‌లోనే ఉన్నా...

టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో వడ్డే నవీన్ మాట్లాడుతూ .. ‘మా నాన్న గారు చనిపోయిన తరువాత నేను నటిస్తూ...నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. సినిమాల‌కు దూర‌మై నేను ఎక్క‌డికి వెళ్ల‌లేదు. ఈ ప‌దేళ్లు హైద‌రాబాద్‌లోనే ఉన్నాను. బ‌య‌ట క‌నిపించ‌డం నాకు ఇష్టం ఉండ‌దు. కెరీర్‌కు బ్రేక్ తీసుకోలేదు. వచ్చింది. ఈ గ్యాప్‌లో చాలా క‌థ‌లు విన్నాను. నా వద్దకు వచ్చిన కథలు నచ్చలేదు, నచ్చిన కథలు నా వద్దకు రాలేదు. చివ‌ర‌కు ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు క‌థ చాలా న‌చ్చింది. ఈ స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం వర్క్ చేశాం. కథ మొత్తం రెడీ అయ్యాకే షూటింగ్‌కి వెళ్లాం. గత పదేళ్లుగా నేను ఎక్కడా కనిపించకపోయినా, సినిమాలు చేయకపోయినా నన్ను ఆడియెన్స్ మ‌ర్చిపోక‌పోవ‌డం నా అదృష్టం" అని అన్నారు.

 

Advertisement
Advertisement