Arvind Kejriwal | సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్.. మద్యం పాలసీ కేసు మరో బెంచ్‌కు ఇవ్వాలని..!
Arvind Kejriwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు తనకు ఇచ్చిన డిశ్చార్జ్‌ను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ సవర్ణ కాంత్ శర్మ బెంచ్ నుంచి ఆ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
Arvind Kejriwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు తనకు ఇచ్చిన డిశ్చార్జ్‌ను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ సవర్ణ కాంత్ శర్మ బెంచ్ నుంచి ఆ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా కేజ్రీవాల్ సవాల్ చేశారు. ప్రధాన న్యాయమూర్తి సూచనల ఆధారంగా ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. అయితే, కేసు ఇప్పటికే ఉన్న రోస్టర్ ప్రకారం.. జస్టిస్ శర్మకు కేటాయించారని, మరో బెంచ్‌కు మార్చాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే, ఈ కేసులో ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. కేసులో ఆధారాలు లేవంటూ డిశ్చార్జి చేసింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనిష్ సిసోడియా, కే కవిత వంటి ప్రముఖులున్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును కూడా ట్రయల్ కోర్టు తీవ్రంగా విమర్శించింది. ఈ కేసు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి కస్టడీలో ఉంచిన విషయం తెలిసిందే. 156 రోజుల తరువాత సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అదే కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా సుమారు 530 రోజుల పాటు కస్టడీలో ఉన్నారు.
ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు. మార్చి 9న జరిగిన విచారణలో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రాథమికంగా తప్పుగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మద్యం పాలసీ కేసులో పలువురికి జస్టిస్ శర్మ గతంలో బెయిల్ నిరాకరించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు వారికి ఉపశమనం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నిష్పాక్షికంగా విచారణ జరగకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తూ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని కోరారు. అదే సమయంలో ట్రయల్ కోర్టు తీర్పుపై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






