Jaya Bachchan | విలేకరుని కసురుకున్న జయా బచ్చన్.. మైక్‌ను పక్కకు నెట్టేసి
Jaya Bachchan | మీడియా ప్రతినిధి పట్ల ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ (Jaya Bachchan) దురుసుగా ప్రవర్తించారు. మైక్‌కు పక్కకు నెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Jaya Bachchan | త్రినేత్ర న్యూస్ : ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ (Jaya Bachchan) ఏదో ఒక వివాదంతో నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటారు. ముఖ్యంగా మీడియా పట్ల ఆమె ప్రవర్తించే తీరు చర్చకు దారి తీస్తుంటుంది. ఫొటోలు తీస్తే కసురుకోవడం, ప్రశ్నిస్తే మైక్‌లను నెట్టేయడం చేస్తుంటారు. తాజాగా ఆమె మరోసారి మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించి హెడ్‌లైన్స్‌లో నిలిచారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండీ కూటమి (INDIA bloc) పక్షాలు ఇవాళ ఢిల్లీలో సేవ్ డెమొక్రసీ పేరుతో భారీ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో జయా బచ్చన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా రిపోర్టర్ ఒకరు జయాబచ్చన్‌ను ఓ పోస్టర్ గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం చెప్పకపోగా తీవ్ర అసహనానికి గురయ్యారు. సదరు రిపోర్టర్‌ను కసురుకుని మైక్‌కు పక్కకు నెట్టేశారు. జయా బచ్చన్ మీడియా ప్రతినిధిపై కసురుకుంటూ, మైక్ పక్కకు నెట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జయా బచ్చన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, గతంలో కూడా జయా బచ్చన్ మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్ల (Paparazzi) పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.
Jaya Bachchan has started treating news reporters the same way she treats paparazzi, even telling them to move their mic away.
The attitude is never going to change. If someone big and influential were in front of her, she would be smiling and happily chatting with them instead. https://t.co/ggJML1z3yi
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) October 6, 2026
Also Read..
నిబంధనల ప్రకారం జరిగుంటే.. ఆ 16 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?
యూపీ ఓటరు లిస్టులో కొత్తగా చేర్చిన ఆ 16 లక్షల మంది ఎవరు..?
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలిస్తాం
- ●Sonakshi Sinha | భార్య హీరోయిన్ - భర్త విలన్ - పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ
- ●Priyank Kharge | నిబంధనల ప్రకారం జరిగుంటే.. ఆ 16 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?
- ●Ramchandar Rao | చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం
- ●MP Chamala | జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
- ●HMWSSB | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!

Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలిస్తాం

Sonakshi Sinha | భార్య హీరోయిన్ - భర్త విలన్ - పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ

Priyank Kharge | నిబంధనల ప్రకారం జరిగుంటే.. ఆ 16 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?

Ramchandar Rao | చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం






