Amitabh Bachchan | చిక్కుల్లో అమితాబ్ జల్సా – ఆస్తి వివాదంపై బిగ్‌బీ పోస్ట్ వైరల్
అమితాబ్ బచ్చన్ కుటుంబంలో ఆస్తి వివాదం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అమితాబ్ నివాసం ఉంటున్న జల్సాకు అసలు యాజమానుదారు తానేనని, గిఫ్డ్ డీడ్ ద్వారా అక్రమంగా ఆ బంగళాను జయా బచ్చన్ పేరు మీదకు బదలాయించారని అమితాబ్ సోదరుడు అజితాబ్ బచ్చన్ భార్య రమోలా ఆరోపించారు. ఈ ఆస్తి వివాదంపై సెటైరికల్‌గా బిగ్‌బీ రియాక్ట్ అయ్యారు.
Entertainment | Published On Nov 14, 2026, 3.33 pm IST
Amitabh Bachchan | బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌బచ్చన్ కుటుంబంలో నెలకొన్న ఆస్తి వివాదం హాట్ టాపిక్‌గా మారింది. అమితాబ్ బచ్చన్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని జుహూ ఏరియాలో ఉన్న జల్సా అనే బంగళాలో నివసిస్తున్నారు. 1982లో సత్తే పే సత్తా సినిమాలో నటించినందుకు పారితోషికం బదులుగా నిర్మాత రమేష్ సిప్సీ నుంచి బిగ్‌బీ ఈ బిల్డింగ్‌ను బహుమతిగా స్వీకరించారు. పది వేలకుపైగా చదరపు అడుగుల విస్తీర్ణంతో రాయల్ లుక్‌తో ఉండే ఈ బిల్డింగ్ ఖరీదు ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం 150 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
అమితాబ్ సోదరుడు...
జల్సా యాజమాన్య హక్కుల విషయంలో అమితాబ్ బచ్చన్ కుటుంబంపై ఆయన సోదరుడు అజితాబ్ బచ్చన్ భార్య రమోలా సంచలన ఆరోపణలు చేసింది. జల్సా తన పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందని , తన అనుమతి లేకుండా అక్రమంగా జయాబచ్చన్ పేరు మీదకు యాజమాన్య హక్కులను బదలాయించారంటూ రమోలా బచ్చన్ ఆరోపించారు.
గిఫ్ట్ డీడ్ ...
ఆస్తి బదిలీ కోసం 1993లో రాసిన గిఫ్ట్ డీడ్ అవకతవకలు ఉన్నాయని రమోలా అన్నారు. సాక్షి సంతకాలు, స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించకుండా గిఫ్ట్ డీడ్ కింద ఆస్తిని అక్రమంగా లాక్కున్నారంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికీ జల్సా యజమానుదారుగా తన పేరు ఉందని రమోలా తెలిపారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అధికారులకుఆమె ఫిర్యాదు చేశారు.
ఇన్‌డైరెక్ట్‌గా...
ఆస్తి వివాదంపై అమితాబ్ బచ్చన్ రియాక్ట్ అయ్యారు. ఇన్‌డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "ఏదైనా పొందలేనప్పుడు దానిని సాధించడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ఎంత దొరికితే అదే చాలని తృప్తి పడుతుంటాం. దేవుడి దయతో కష్టపడకుండానే అన్ని లభిస్తున్నప్పుడు ఇంతేనా అంటూ ఆలోచిస్తాం. అడగకుండానే అన్ని దొరుకుతున్నప్పడు మన ఇలాగే ఆలోచనలు ఉంటాయి" అంటూ అమితాబ్ పేర్కొన్నారు. ఆస్తి వివాదం గురించే రమోలాపై సెటైరికల్‌గా అమితాబ్ బచ్చన్ ఈ పోస్ట్ పెట్టాడని నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!






