Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలిస్తాం
Ponguleti Srinivas Reddy | క్యూర్ పరిధిలో తొలివిడత ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న లక్ష ఇళ్ల ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కాంట్రాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
5,218 మంది అర్హుల నుంచి లక్కీ డ్రా..
480 కుటుంబాలకు ఇళ్ల కేటాయింపు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్ : క్యూర్ పరిధిలో తొలివిడత ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న లక్ష ఇళ్ల ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా ఏడాది గడువును కాంట్రాక్టర్లకు నిర్ధేశించామని అయితే ఒక నెల ముందుగా పూర్తి చేస్తే రూ.45 లక్షలు, రెండు నెలల ముందుగా పూర్తి చేస్తే రూ. 90 లక్షలు ప్రోత్సాహక బహుమతిగా ఇస్తామని చెప్పామని వివరించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సహచర మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కే.పీ, వివేకానంద, పలువురు లబ్దిదారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు 23 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇందిరమ్మ టవర్స్‌ను నిరంతర ప్రక్రియగా నిర్మిస్తామని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇళ్ల కోసం 7,000 మందికి పైగా దరఖాస్తులు అందగా, పరిశీలన అనంతరం 5,218 మంది అర్హులుగా తేలారని అర్హులైన వారిలో లబ్ధిదారుల ఎంపికను బహిరంగంగా లక్కీ డ్రా ద్వారా చేపట్టి, 480 మంది లబ్ధిదారులను తుది జాబితాలో ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించామని, ఎవరికి ఏ విధంగా ఇల్లు మంజూరైందనే వివరాలను కూడా లబ్ధిదారులకు తెలియజేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అందజేస్తామని చెప్పారు.
ప్రస్తుతం కేటాయించిన ఇళ్లతో కార్యక్రమం ముగియదని, మరో మూడు విడతల్లోనూ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం సుమారు 7.5 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, దీంతో పాటు నియోజకవర్గంలో ఉన్న ఇతర ప్రభుత్వ, హౌసింగ్ శాఖ భూములను గుర్తించి అక్కడ కూడా పేదలకు ఇళ్లు నిర్మించే చర్యలు చేపడతామని తెలిపారు. ఈ మేరకు హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే సూచనలు చేసినట్లు వెల్లడించారు.
ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మంత్రి అన్నారు. లబ్ధిదారులు కూడా తమ ఇళ్ల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. “మీ కళ్ల ముందే మీ ఇల్లు నిర్మించబడాలి.. నాణ్యతతో కూడిన ఇంటిని సొంతం చేసుకున్నామనే తృప్తి, ఆనందం మీకు కలగాలి” అనేదే ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.పేదల చిన్న చిన్న కోరికలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.పేదవాడి సొంతింటి కలను కేవలం హామీగా కాకుండా, కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ శాఖ సెక్రటరీ వి.పి.గౌతమ్, కలెక్టర్ మనూ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
- ●Priyank Kharge | నిబంధనల ప్రకారం జరిగుంటే.. ఆ 16 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?
- ●Ramchandar Rao | చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం
- ●MP Chamala | జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
- ●HMWSSB | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!
- ●Stock Markets | జీడీపీ పెరుగుతున్నా.. భారత స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి..?
- ●Malayalam OTT | టాలీవుడ్ హీరోయిన్ మలయాళం థ్రిల్లర్ మూవీ - ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్

Priyank Kharge | నిబంధనల ప్రకారం జరిగుంటే.. ఆ 16 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?

Ramchandar Rao | చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం

MP Chamala | జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

HMWSSB | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!





