Rs 1 Lakh Rent For 2 BHK | ముంబైలో 2 BHK నెల అద్దె రూ.లక్ష.. నెట్టింట విపరీతంగా చర్చ
Rs 1 Lakh Rent For 2 BHK | ముంబై (Mumbai)లోని పరేల్ (Parel) ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు (software engineers) తమ 2 BHK ఇంటికి నెల అద్దె రూ.లక్ష చెల్లిస్తున్నట్లు (Rs 1 Lakh Rent For 2 BHK) చెప్పడం చర్చనీయాంశమవుతోంది.
Rs 1 Lakh Rent For 2 BHK | నేటి కాలంలో సంపాదన కంటే ఇతర ఖర్చులే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, గురుగ్రామ్ వంటి మెట్రో నగరాల్లో జీవితం ఖరీదుగా మారింది. వచ్చే అరాకొర జీతం కాస్తా ఇంటి అద్దెకే పోతోంది. ఇటీవలే గురుగ్రామ్‌కు చెందిన ఓ యువకుడు పంచుకున్న తన నెలవారీ ఖర్చు వివరాలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో ఇంటి అద్దెలు ఇప్పుడు (House Rent) హాట్‌టాపిక్ అవుతున్నాయి.
సాధారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) అంటేనే లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రెస్ అని చెబుతుంటారు. అక్కడ ఇల్లు అద్దెకు తీసుకోవడం అంటే భారంతో కూడుకున్నది. తాజాగా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్య కొఠారి అపార్ట్‌మెంట్ టూర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ముంబైలోని పరేల్ (Parel) ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు (software engineers) తమ 2 BHK ఇంటికి నెల అద్దె రూ.లక్ష చెల్లిస్తున్నట్లు (Rs 1 Lakh Rent For 2 BHK) చెప్పడం చర్చనీయాంశమవుతోంది. కేవలం 700 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఇంటికి మెయింటెనెన్స్ ఖర్చులతో కలిపి రూ.లక్ష కడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఇంట్లో అద్దె ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యూ మాత్రం తమకు నచ్చిందని చెప్పుకొచ్చారు ఆ యువతులు. ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉండటంతో కిటికీలో నుంచి విమానాలు టేకాఫ్, ల్యాండ్ అవ్వడం స్పష్టంగా కనిపిస్తుందంట. ఖాళీ సమయంలో కిటికీ వద్ద కూర్చుని ఆ దృశ్యాలను చూస్తుంటామని వారు వివరించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కేవలం ఇంటి అద్దే రూ.లక్ష కావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. "కోల్‌కతాలో ఇలాంటి ఇల్లే నాకు రూ.13,000కే దొరికింది" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదో పెద్ద స్కామ్ అని.. సాధారణ నగరాల్లో ఈ అద్దెతో ఇంటిని కొనుగోలు చేసిన ఈఎమ్ఐ కట్టుకుంటే ఇల్లైనా మిగులుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Indian Rupee | మరింత బలహీన పడిన రూపాయి.. ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందా..?
Budget session | నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






