IRCTC | కార్తీకమాసంలో అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ప్రతివారం స్పెషల్ ట్రైన్.. టూర్ ప్యాకేజీ ఇదే
IRCTC | కార్తీక మాసంలో అరుణాచలం (Arunachalam) వెళ్లాలనుకునే యాత్రికులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ (Kacheguda Railway Station) నుంచి ప్రతి శుక్రవారం ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తం 4 రాత్రులు, 5 రోజులపాటూ కొనసాగుతుంది.
IRCTC | త్రినేత్ర న్యూస్ : పవిత్ర కార్తీక మాసంలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన అరుణాచలం (Arunachalam) క్షేత్రానికి వెళ్లి అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. 'అరుణాచల మోక్ష యాత్ర' (ప్యాకేజీ కోడ్: SHR107) (ARUNACHALA MOKSHA YATRA) పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ (Kacheguda Railway Station) నుంచి ప్రతి శుక్రవారం ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తం 4 రాత్రులు, 5 రోజులపాటూ కొనసాగుతుంది.
ఈ టూర్ నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ నుంచి కాచిగూడ-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరడంతో యాత్ర మొదలుతుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఈ ప్యాకేజీలో అరుణాచలంతో పాటు పుదుచ్చేరి, కాంచీపురంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు కవర్ అవుతాయి.
ప్యాకేజీ ధరల విషయానికొస్తే..
- బుకింగ్ చేసుకునే వారి సంఖ్యను బట్టి ప్యాకేజీ ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటుంది. 1-3 వ్యక్తులు బుక్ చేసుకుంటే కంఫర్ట్‌లో ఒక్కో ప్రయాణికుడికి రూమ్ ట్విన్ షేరింగ్‌కు రూ.16,900గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,210 ఉంటుంది. స్టాండర్డ్‌లో రూమ్ ట్విన్ షేరింగ్ అయితే రూ.14,820 కాగా, ట్రిపుల్ షేరింగ్ రూ.11,125గా ఉంటుంది.
- నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు కలిసి బుక్ చేసుకుంటే కంఫర్ట్‌లో ఒక్కో ప్రయాణికుడుకి డబుల్ షేరింగ్‌కు రూ.13,900గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.11,920గా ఉంటుంది. స్టాండర్డ్‌లో డబుల్ షేరింగ్‌కు రూ.11,820గా ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.9,840 చెల్లించాలి.
- పిల్లల ఛార్జీల విషయానికొస్తే (5-11 ఏళ్ల వయసు గల పిల్లలు).. కంఫర్ట్ (3AC) విభాగంలో బెడ్‌తో రూ.10,030, బెడ్ లేకుండా రూ.7,530 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ (స్లీపర్) విభాగంలో బెడ్‌తో రూ.7,950, బెడ్ లేకుండా రూ.5,450 గా నిర్ణయించారు.
వసతి, సదుపాయాలు..
రైలు టికెట్లు, స్థానిక ప్రయాణాలకు ఏసీ వాహనం, 2 రాత్రులు హోటల్ వసతి, 2 రోజులు అల్పాహారం, ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. మధ్యాహ్న, రాత్రి భోజనాలు, రైలులో ఆహారం, దర్శన టికెట్లు, గైడ్ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
5 రోజుల ప్రయాణ షెడ్యూల్ ఇదే..
- ఐదు రోజుల యాత్రలో ప్రయాణ షెడ్యూల్ విషయానికొస్తే.. ప్రతి శుక్రవారం సాయంత్రం 5:00 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది.
- రాత్రంతా ప్రయాణం తర్వాత మరుసటి రోజు అంటే శనివారం ఉదయం 11:05 గంటలకు రైలు పుదుచ్చేరి చేరుకుంటుంది. అక్కడ హోటల్‌లో చెక్-ఇన్ అవుతారు. అనంతరం ఆరోవిల్లె, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ సందర్శించి రాత్రికి అక్కడే బస చేస్తారు.
- ఆదివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పుదుచ్చేరి నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) బయలుదేరుతారు. హోటల్‌లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత అరుణాచలేశ్వర స్వామి దర్శనం, గిరి ప్రదక్షిణకు సమయం ఉంటుంది. రాత్రికి అరుణాచలంలోనే బస.
- మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటారు. హోటల్ చెక్ అవుట్ చేసి కాంచీపురం బయల్దేరతారు. కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అరక్కోణం స్టేషన్ నుంచి 6 గంటలకు తిరుగు ప్రయాణం కోసం రైలు ఎక్కుతారు.
- మంగళవారం ఉదయం 7:50 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి తమ గమ్య స్థానాలకు వెళ్లిపోతారు. దీంతో ఈ యాత్ర ముగుస్తుంది.
Also Read..
ఐపీఎల్ 2027 వేలానికి వేళాయె.. గోవాలో మినీ ఆక్షన్
పంజాబ్ రైతుకు వరించిన అదృష్టం.. లాటరీలో రూ.12 కోట్ల జాక్‌పాట్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు





