త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bumper Lottery | పంజాబ్ రైతుకు వ‌రించిన అదృష్టం.. లాట‌రీలో రూ.12 కోట్ల జాక్‌పాట్‌

Bumper Lottery | పంజాబ్‌కు చెందిన రైతు బ‌ల్జింద‌ర్ సింగ్ (Baljinder Singh)కు భారీ జాక్‌పాట్ త‌గిలింది. లాట‌రీలో రూ.500 పెట్టి టికెట్ కొంటే.. ఏకంగా రూ.12 కోట్ల న‌గ‌దు వ‌రించింది. అదృష్టం అత‌డిని రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడిని చేసింది.

D

National | Published On Nov 18, 2026, 2.46 pm IST

Bumper Lottery | పంజాబ్ రైతుకు వ‌రించిన అదృష్టం.. లాట‌రీలో రూ.12 కోట్ల జాక్‌పాట్‌
Advertisement

Bumper Lottery | త్రినేత్ర న్యూస్ : పంజాబ్‌కు చెందిన ఓ రైతుకు లాటరీ (Lottery) ద్వారా అదృష్టం వ‌రించింది. మొహాలి జిల్లా డెరాబాస్సి సమీపంలోని హుమాయున్‌పూర్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైతు బల్జిందర్ సింగ్ (Baljinder Singh) దీపావళి బంపర్ లాటరీలో ఏకంగా రూ. 12 కోట్లు గెలుచుకున్నారు.

బల్జిందర్ సింగ్ వ్యవసాయం చేస్తూనే జీవనోపాధి కోసం ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ‌త 15 ఏళ్లుగా అత‌డు క్ర‌మం త‌ప్ప‌కుండా లాట‌రీ టికెట్లు కొనుగోలు చేస్తూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌సారి కూడా అదృష్ట ల‌క్షి అత‌డి త‌లుపు త‌ట్ట‌లేదు. తాజాగా పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ లాటరీ 2026లో ఆయ‌న రూ.500 పెట్టి టికెట్ కొన్నాడు. ఆ ఒక్క టికెట్ అత‌డి జీవితాన్నే మార్చేసింది. అత‌డికి భారీ జాక్‌పాట్ తెచ్చి పెట్టింది. ఈ లాట‌రీ టికెట్ ద్వారా ఆయన ఏకంగా రూ. 12 కోట్ల మొదటి బహుమతిని గెలుచుకున్నారు. ఈ మొత్తంలో 30 శాతం పన్ను (TDS), ఏజెంట్ కమీషన్ పోను బల్జిందర్ సింగ్‌కు సుమారు రూ. 8.40 కోట్లు అంద‌నున్నాయి.

మంగ‌ళ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో లాట‌రీ త‌గిలిన‌ట్లు తెలిసింద‌ని బ‌ల్జింద‌ర్ సింగ్ తెలిపారు. "నేను 2010 నుంచి క్ర‌మం తప్ప‌కుండా లాట‌రీ టికెట్లు కొంటూ వ‌స్తున్నా. రూ.12 కోట్ల భారీ జాక్‌పాట్ త‌గులుతుంద‌ని నేను క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. చివ‌ర‌కు దేవుడు నా ప‌రిస్థితిని అర్థం చేసుకున్న‌ట్లున్నాడు. ఈ డ‌బ్బులో ఎక్కువ మొత్తాన్ని నా పిల్ల‌ల చ‌దువుల కోసం ఉప‌యోగిస్తా" అని బ‌ల్జింద‌ర్ సింగ్ తెలిపారు. ఇక ఈ లాట‌రీతో బ‌ల్జింద‌ర్ జీవిత‌మే మారిపోనుంది.

Also Read..

సీజేఐపై అనుచిత వ్యాఖ్య‌లు.. న్యాయ‌వాదికి ధిక్కార నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

కుప్ప‌కూలిన సైనిక విమానం.. 19 మంది మృతి

రేపు సిద్దిపేట సభలో దేశంలోనే తొలిసారి 'ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా' ప్రారంభం

Advertisement
Advertisement