IPL 2027 Player Auction | ఐపీఎల్ 2027 వేలానికి వేళాయె.. గోవాలో మినీ ఆక్షన్
IPL 2027 Player Auction | రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో ఐపీఎల్ 2027 వేలానికి సంబంధించి (IPL 2027 Player Auction) కీలక అప్‌డేట్ వచ్చింది. ఐపీఎల్ 2027 వేలానికి ముహూర్తం ఖరారైంది. మినీ వేలం డిసెంబర్ 16న గోవా (Goa) వేదికగా జరగనుంది.
IPL 2027 Player Auction | త్రినేత్ర న్యూస్ : ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు ఆటగాళ్ల రిటెన్షన్, విడుదల ప్రక్రియ పూర్తైంది. ఫ్రాంచైజీలు వద్దనుకున్న ఆటగాళ్లను విడిచిపెట్టాయి. రిటెన్షన్ ప్రక్రియలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 55 మంది విదేశీ ఆటగాళ్లతో కలిపి 184 మంది ఆటగాళ్లను అట్టపెట్టుకోవడానికి రూ. 1,002.05 కోట్లు వెచ్చించాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో ఐపీఎల్ 2027 వేలానికి సంబంధించి (IPL 2027 Player Auction) కీలక అప్‌డేట్ వచ్చింది. ఐపీఎల్ 2027 వేలానికి ముహూర్తం ఖరారైంది. మినీ వేలం తేదీ, సమయం, వేదికను ఐపీఎల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది
మూడేళ్ల తర్వాత భారత్ వేదికగా..
అధికారిక షెడ్యూల్ ప్రకారం.. మినీ వేలం వచ్చే నెల అంటే డిసెంబర్ 16న గోవా (Goa) వేదికగా జరగనుంది. ఐటీసీ గ్రాండ్ హోటల్ వేదికగా ఉదయం 11 గంటలకు బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది. గత మూడు సీజన్ల వేలాలు దుబాయ్, జెడ్డా, అబుదాబి వేదికగా జరగ్గా.. మూడేళ్ల విరామం తర్వాత భారత్‌లో జరగనుండటం విశేషం. ఇక వేలానికి ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 15న ఫ్రాంచైజీ అధికారుల కోసం ప్రత్యేక బ్రీఫింగ్ ఉంటుంది.
ఫ్రాంచైజీల వద్ద రూ. 297.95 కోట్ల పర్స్
ఈ మినీ ఆక్షన్ కోసం అన్ని జట్లు కసరత్తు మొదలు పెట్టాయి. జట్లలో మొత్తం 66 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 25 విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఉండగా, 41 భారతీయ ఆటగాళ్ల స్లాట్లు ఉన్నాయి. 10 ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 297.95 కోట్ల పర్స్ అందుబాటులో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రూ. 47.45 కోట్ల అత్యధిక పర్స్‌తో వేలంలోకి అడుగుపెడుతుండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 41.65 కోట్లతో రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ.40.15 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.39.50 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ అత్యధికంగా 22 మందిని రిటైన్ చేసుకుని కేవలం రూ.8.75 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో వేలానికి వస్తోంది.
The stage is set for the next big bidding battle 🙌
The #TATAIPL 2027 Player Auction is set to take place on December 16, 2026 in Goa 🌴
#TATAIPLAuction https://t.co/NIRc7pChaO
— IndianPremierLeague (@IPL) November 18, 2026
Also Read..
పంజాబ్ రైతుకు వరించిన అదృష్టం.. లాటరీలో రూ.12 కోట్ల జాక్‌పాట్
సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. న్యాయవాదికి ధిక్కార నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Chinna Reddy | రేవంత్‌రెడ్డి అవినీతి లక్ష కోట్లు దాటిపోయింది.. ఆయన ఒక బీజేపీ కోవర్ట్
- ●Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
- ●Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది
- ●Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్
- ●Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- ●Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ - సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్

Chinna Reddy | రేవంత్‌రెడ్డి అవినీతి లక్ష కోట్లు దాటిపోయింది.. ఆయన ఒక బీజేపీ కోవర్ట్

Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న

Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది

Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్






