Charity Scam | ఇరాన్ వార్ పేరుతో భారీ స్కామ్.. ఛారిటీ ముసుగులో దేశవ్యతిరేక శక్తుల కోసం నిధుల సేకరణ..!
Charity Scam | మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం (Iran war) అనేక సమస్యలను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది.
Charity Scam | మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం (Iran war) అనేక సమస్యలను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఈ యుద్ధం మాటున మన దేశంలో కొన్ని శక్తులు తీవ్రవాద కార్యకలాపాలకు (anti-national activities) పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) సైతం ఇరాన్ యుద్ధం పేరుతో ఓ భారీ ఛారిటీ స్కామ్ (Charity Scam) జరుగుతోందని హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.
ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇదే సమయంలో వార్‌తో అనేక మంది నిరాశ్రయులయ్యారు. యుద్ధ బాధితులను ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నాయి. ఇదే ఆసరాగా కొందరు ఛారిటీ ముసుగులో దేశ వ్యతిరేక శక్తుల కోసం నిధులు సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరిగిన యుద్ధం సమయంలోనూ ఇలాంటి కార్యకలాపాలే వెలుగులోకి వచ్చినట్లు ఐబీ అధికారులు తెలిపారు. ఉద్రిక్తతల సమయాల్లో కొత్త కొత్త స్వచ్ఛంద సంస్థలు పుట్టుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల భావోద్వేగాలే లక్ష్యం..
ఈ నకిలీ స్వచ్ఛంద సంస్థలను నడిపించే వ్యక్తులు (Fake fundraisers) ప్రజలను భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకుని నిధులను సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారు యుద్ధానికి సంబంధించిన ఫొటోలను చూపిస్తారు. అయితే నిధుల సేకరణ కోసం చాలా వరకు ఫోటోలను డిజిటల్‌గా మార్పులు (Alter) చేస్తారని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు. ఆ ఫోటోలు చూసి చలించిపోయి భారీగా డబ్బుతో పాటు బంగారం కూడా విరాళంగా ఇచ్చే వారు చాలా మంది ఉన్నారని ఆయన వెల్లడించారు.
జమ్ము కశ్మీర్‌లోనే అత్యధికం
ఇక ఇరాన్ యుద్ధం పేరుతో జరుగుతున్న ఈ ఛారిటీ స్కామ్ ప్రభావం జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) ప్రాంతంలో అత్యధికంగా ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇరాన్ యుద్ధ బాధితులకు అండగా ఉండాలంటూ కొంతమంది ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరిస్తున్నట్లు ఐబీ అధికారులు తెలిపారు. ప్రజల భావోద్వేగాలను ఆసరగా చేసుకొని కట్టుకథలు అల్లుతూ మోసాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తే సులభంగా దొరికిపోతామనే ఉద్దేశంతో ఈ ముఠాలు పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, అంటే ఇంటింటికీ తిరుగుతూ వసూళ్లకు పాల్పడుతున్నాయని తెలిపారు. విరాళం ఇచ్చిన వారికి నకిలీ రశీదులు ఇస్తూ.. ఈ డబ్బును ఇరాన్‌లోని బాధితులకు పంపుతామని ప్రజలను నమ్మిస్తున్నట్లు హెచ్చరించారు.
స్కామ్ వెనుక వారి హస్తం..?
ఈ విరాళాల స్కామ్ వెనుక వేర్పాటువాద ముఠాల హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కశ్మీర్‌లో వేర్పాటువాద గ్రూపులకు నిధులు సేకరించిన నెట్‌వర్క్‌లే ఇప్పుడు ఈ ఛారిటీ స్కామ్ నడుపుతున్నాయని గుర్తించారు. ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపి ఈ బృందాలు ఏకంగా కోట్ల రూపాయలు విరాళంగా సేకరించినట్లు సమాచారం. ఒక్క కశ్మీర్‌లోనే ఈ ముఠాలు దాదాపు రూ.16 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. స్కామర్స్ కట్టుకథలు నమ్మి అమాయక ప్రజలు తాము పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా వారికి ఇచ్చేసినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
షియా సామాజిక వర్గమే లక్ష్యంగా దోపిడీ..
కొన్ని సందర్భాల్లో ప్రజలు తమ వద్ద ఉన్న బంగారం, రాగి పాత్రలను కూడా మోసగాళ్లకు అప్పగించడం ఆందోళన కలిగించే విషయం. ప్రధానంగా కశ్మీర్ ప్రాంతంలోని షియా సామాజిక వర్గమే (Shia community) లక్ష్యంగా ఈ దోపిడీ జరుగుతోందని అధికారులు తెలిపారు. ఇలా సేకరించిన నిధులను కొందరు వ్యక్తిగత లాభాలకు వాడుకుంటున్నట్లు కూడా తేలింది. సింహభాగం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, ముఖ్యంగా జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకే ఉపయోగిస్తున్నారని ఐబీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యకలాపాలపై నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.2408.51 కోట్లు చెల్లించాం : సీఎం రేవంత్ రెడ్డి
సింగర్ అవతారమెత్తిన బండి సంజయ్.. ఆర్ఎస్ఎస్ గీతాల ఆలపన ప్రోమో హల్‌చల్
వందేభారత్‌లో నాసిరకం భోజనం.. కస్టమర్ ఫిర్యాదుతో ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



