త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | సింగర్ అవ‌తార‌మెత్తిన‌ బండి సంజయ్.. ఆర్ఎస్ఎస్ గీతాల‌ ఆలప‌న ప్రోమో హ‌ల్‌చ‌ల్‌

Bandi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) గాయకుడి (singer) అవతారమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) స్థాపించి శత వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించారు. ప్ర‌స్తుతం ఆయ‌న పాడిన ప్రోమో సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.ప్ర‌స్తుతం ఆయ‌న పాడిన ప్రోమో సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

S

Telangana | Published On Mar 26, 2026, 12.35 pm IST

Bandi Sanjay | సింగర్ అవ‌తార‌మెత్తిన‌ బండి సంజయ్.. ఆర్ఎస్ఎస్ గీతాల‌ ఆలప‌న ప్రోమో హ‌ల్‌చ‌ల్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) గాయకుడి (singer) అవతారమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) స్థాపించి శత వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ పాడిన ఆర్ఎస్ఎస్ గీతాలకు సంబంధించిన ప్రోమో (Promo) తాజాగా విడుదలైంది. ప్ర‌స్తుతం ఆయ‌న పాడిన ప్రోమో సోష‌ల్‌మీడియా(Social Media) లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. శ్రీరామ నవమిని పురస్క‌రించుకొని రేపు కరీంనగర్ (Karimnagar)లో ఆయ‌న‌ పాడిన పాటలను అధికారికంగా విడుదల (Release) చేయనున్నారు.

ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో బండి ముందుకెళ్తున్నారు. బండి సంజయ్ కి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పని చేసిన అనుభ‌వం ఉంది. సంవ‌త్స‌రాలుగా అందులో ప‌ని చేశారు. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న‌ గీతాలను ఆలపించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement