త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఆరోగ్య శ్రీ బ‌కాయిలు రూ.2408.51 కోట్లు చెల్లించాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఆరోగ్య శ్రీ బ‌కాయిల‌ను ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఆరోగ్య శ్రీ బ‌కాయిల‌ను ఇప్పటివరకు రూ.2408.51 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు.

S

Telangana | Published On Mar 26, 2026, 12.38 pm IST

CM Revanth Reddy | ఆరోగ్య శ్రీ బ‌కాయిలు రూ.2408.51 కోట్లు చెల్లించాం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు రూ. 972 కోట్లు
ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌కు రూ. 1480 కోట్లు
సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 2046 కోట్లు
మొత్తంగా రూ. 4500 కోట్లు పేద‌ల కోసం ఖ‌ర్చు
టీచింగ్ కాలేజీల‌కు ఆరోగ్య‌శ్రీ రోగులు
అద‌నంగా 10 వేల ప‌డ‌క‌లు
శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఆరోగ్య శ్రీ బ‌కాయిల‌ను ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఆరోగ్య శ్రీ బ‌కాయిల‌ను ఇప్పటివరకు రూ.2408.51 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. దీనిలో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927 కోట్లు చెల్లించామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆరోగ్య శ్రీ బ‌కాయిల‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు అడిగిన ప్ర‌శ్న‌కు సీఎం రేవంత్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి డిసెంబ‌ర్ 6, 2023 వ‌ర‌కు ప్ర‌తినెల స‌గ‌టున రూ. 52 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం జ‌రిగింది. డిసెంబ‌ర్ 7, 2023 నుంచి మార్చి 25, 2026 వ‌ర‌కు ప్ర‌తి నెల ఈ ప్ర‌భుత్వం రూ. 89 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం జ‌రిగింది. ఆరోగ్య‌శ్రీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు మూత‌ప‌డే అవ‌కాశం ఉంది.. ఆస్ప‌త్రులు ఇచ్చిన నోటీసుల‌పై కూడా ప్ర‌భుత్వం స్పందించ‌డం లేద‌ని మాట్లాడుతున్నారు. ఈ వార‌స‌త్వం వారి నుంచి మాకు వ‌చ్చింది. ఆరోగ్య శ్రీ బ‌కాయిలు పెట్టి, అధికారాన్ని కోల్పోయి, ఆభారాన్ని మా నెత్తి మీద పెడితే.. ఆ భారాన్ని మోస్తూనే రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచ‌డం జ‌రిగింది. 2023 డిసెంబ‌ర్ 7వ తేదీ నాడు బాధ్య‌త తీసుకున్న‌ప్పుడు వార‌స‌త్వంగా మాకు వ‌చ్చిన భారం రూ. 600 కోట్ల 27 ల‌క్ష‌లు. ఇక గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్స్‌కు రూ. 240 కోట్ల 11 ల‌క్ష‌లు, ప్ర‌యివేటు హాస్పిట‌ల్స్‌కు రూ. 360 కోట్ల 16 ల‌క్ష‌లు బకాయిలు ఉండే. అదే విధంగా మేం ప‌దవీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత 2023 డిసెంబ‌ర్ 8వ తేదీ నుంచి ఈ రోజు వ‌ర‌కు రూ. 2408 కోట్ల 51 ల‌క్ష‌లు బిల్లులు చెల్లించింది. ఇందులో గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ళ్ల‌కు రూ. 927 కోట్ల 99 ల‌క్ష‌లు, ప్ర‌యివేటు హాస్పిట‌ళ్ల‌కు రూ. 1480 కోట్ల 52 ల‌క్ష‌ల చెల్లించ‌డం జ‌రిగింది. అంటే ప్ర‌తి నెల గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ళ్ల‌కు రూ. 34 కోట్లు, ప్రయివేటు హాస్పిట‌ళ్ల‌కు రూ. 55 కోట్లు ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ రోజు వ‌ర‌కు మొత్తం బ‌కాయిలు రూ. 727.75 కోట్లు కాగా, మా ప్ర‌భుత్వం అద‌నంగా బ‌కాయి ప‌డ్డది రూ. 100 కోట్లు మాత్ర‌మే. అయితే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులకే బ‌కాయిలు ఎక్కువ ఉన్నాయి. గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్స్‌కు రూ. 496. 31కోట్లు ఉంటే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు రూ. 231.44 కోట్ల బ‌కాయిలు ఉన్నాయి. ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి 2022-23లో నెల‌కు రూ. 102 కోట్లు ఖ‌ర్చు అయితే.. 2025-26లో ప్ర‌తి నెల‌కు రూ. 184 కోట్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

పేద‌ల వైద్యం కోసం రూ. 4500 కోట్లు ఖ‌ర్చు

ఇక సీఎం రిలీఫ్ పండ్ విష‌యానికి వ‌స్తే.. పార‌ద‌ర్శ‌కంగా చెక్కులు అంద‌జేస్తున్నాం. 27 నెల‌ల కాలంలోనే రూ. 2046 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. రూ. 2400 కోట్లు ఆరోగ్య‌శ్రీలో ఇచ్చాం. దాదాపు రూ. 4500 కోట్లు పేద‌ల వైద్యం కోసం ఖ‌ర్చు పెట్టింది ఈ ప్ర‌భుత్వం. ఇది స‌రిపోతుందా అంటే స‌రిపోదు. అందుకే ఇవాళ ఇందిర‌మ్మ కుటుంబ జీవిత బీమా తీసుకొచ్చాం. ఒక కోటి 15 ల‌క్ష‌ల కుటుంబాలు ఉంటే ప్ర‌తి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఈ ప‌థ‌కంతో కుటుంబానికి దీమా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. పేద‌ల‌ను ఆదుకోవ‌డానికి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని సీఎం తెలిపారు.

టీచింగ్ కాలేజీల‌కు ఆరోగ్య శ్రీ రోగులు

రాష్ట్రంలో 35 మెడిక‌ల్ కాలేజీలు ఉన్నాయి. టీచింగ్ కాలేజీల‌కు రోగులు రావ‌డం లేదు. పేద‌లు వైద్యం కోసం వెళ్లే ద‌గ్గ‌ర స‌రైన డాక్ట‌ర్లు లేరు. ఆరోగ్య శ్రీ రోగుల‌ను టీచింగ్ కాలేజీల‌కు పంపించే ఆలోచ‌న చేస్తున్నాం. ఆరోగ్య శ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ను ఈ ఆస్ప‌త్రుల‌కు ఇస్తాం. దీని వ‌ల్ల ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ మెరుగు ప‌డుతుంది. ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ‌ను గ్రూప్ వ‌న్ అధికారికి ఇవ్వాల‌ని అనుకుంటున్నాం అని సీఎం పేర్కొన్నారు.

అద‌నంగా 10 వేల ప‌డ‌క‌లు 

నిమ్స్‌కు మాత్ర‌మే ఎల్‌వోసీ ఇస్తున్నాం. ఉస్మానియా ఆస్ప‌త్రిని నూత‌నంగా గోషామ‌హ‌ల్‌లో 30 ఎక‌రాల్లో రూ. 3 వేల కోట్ల‌తో 2 వేల ప‌డ‌క‌ల‌తో నిర్మిస్తున్నాం. గాంధీ, వ‌రంగ‌ల్ ఆస్ప‌త్రుల‌ను పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేస్తున్నాం. 10 వేల ప‌డ‌క‌లు అద‌నంగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు య‌త్నిస్తున్నామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement