త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran War | కువైట్‌పై ఇరాన్ దాడి.. భార‌తీయ కార్మికుడు మృతి

Iran War | కువైట్‌లోని విద్యుత్ (Kuwait Power Plant), నీటి శుద్ధి క‌ర్మాగారాల‌పై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడిలో ఓ భార‌తీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు (Indian Killed).

D

National | Published On Mar 30, 2026, 12.24 pm IST

Iran War | కువైట్‌పై ఇరాన్ దాడి.. భార‌తీయ కార్మికుడు మృతి
Advertisement

Iran War | మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు (Iran War) చ‌ల్లారడం లేదు. రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతున్నాయి. తాజాగా కువైట్‌లోని విద్యుత్ (Kuwait Power Plant), నీటి శుద్ధి క‌ర్మాగారాల‌పై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడిలో ఓ భార‌తీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు (Indian Killed). ఈ విష‌యాన్ని కువైట్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కువైట్‌పై ఇరాన్ దురాక్ర‌మ‌ణ కొన‌సాగిస్తోందని పేర్కొంది. విద్యుత్‌, నీటి శుద్ధి ప్లాంట్‌ల‌పై దాడి చేసిన‌ట్లు చెప్పింది. ఈ దాడి ఫ‌లితంగా ఓ భార‌తీయ కార్మికుడు మ‌ర‌ణించిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. అంతేకాదు, ఆయా భ‌వ‌నాలు తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ట్లు తెలిపింది. భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు పేర్కొంది.

మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై భార‌త రాయ‌బార కార్యాల‌యం ఎక్స్ వేదిక‌గా స్పందించింది. కువైట్‌లోని నీటి శుద్ధీక‌ర‌ణ ప్లాంట్‌పై జ‌రిగిన దాడిలో భార‌తీయ పౌరుడు మ‌ర‌ణించ‌డం ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేసింది. మృతుడి కుటుంబానికి అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందించ‌నున్న‌ట్లు తెలిపింది.

Also Read..

ఖ‌ర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవ‌చ్చు : డొనాల్డ్ ట్రంప్

గ్యాస్, పెట్రోల్ కొర‌త‌.. రేష‌న్ షాపుల్లో మ‌ళ్లీ కిరోసిన్..

స్టాక్ మార్కెట్ల‌లో బ్ల‌డ్ బాత్ కంటిన్యూ.. భారీగా ప‌త‌న‌మైన సూచీలు..

Advertisement

తాజావార్తలు

Advertisement