Donald Trump | ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు : డొనాల్డ్ ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని వాషింగ్టన్ స్వాధీనం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
International | Published On Mar 30, 2026, 12.06 pm IST
Donald Trump | ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్ చమురు ఎగుమతులకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్ (Kharg Island)పై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కన్నేసిన విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఖర్గ్ ద్వీపం అమెరికాకు వ్యూహాత్మకంగా మారింది. దీన్ని వాషింగ్టన్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని వాషింగ్టన్ స్వాధీనం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "నిజం చెప్పాలంటే.. ఇరాన్‌లోని చమురును స్వాధీనం చేసుకోవడమే నాకు చాలా ఇష్టమైన పని. కానీ అమెరికాలోని కొంతమంది తెలివితక్కువ వ్యక్తులు మాత్రం 'నువ్వు ఎందుకు అలా చేస్తున్నావ్..?' అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి వారు మూర్ఖులు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. పెంటగాన్ వద్ద అనేక సైనిక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
"బహుశా మేము ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. మా దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. కొంతకాలం పాటూ ఖర్గ్ ద్వీపాన్ని మా ఆధీనంలో ఉంచుకోవచ్చు కూడా. ప్రస్తుతం అక్కడ వారికి ఎలాంటి రక్షణ వ్యవస్థలు లేవు. కాబట్టి మేము దాన్ని చాలా సులభంగా స్వాధీనం చేసుకోగలం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అమెరికా గనుక ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే.. యుద్ధం మరింత తీవ్రం కానుంది. అంతేకాదు, ప్రపంచ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో సంక్షోభం కారణంగా గత నెల రోజుల్లోనే బ్రెంట్ క్రూడ్ ధర 50 శాతం పెరిగింది. సోమవారం నాటికి ఆసియా ట్రేడింగ్‌లో బ్యారెల్‌కు 116 డాలర్లకు పైకి చేరుకుంది.
కాగా, ఇరాన్ తీరానికి 25కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఖర్గ్ దీవి భారీ చమురు నిల్వలకు నిలయం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. అందుకే ఈ ఐలాండ్‌ను ఇరాన్ ఆర్థిక కిరీటంగా అభివర్ణిస్తారు. ఒక్కరోజే ఇక్కడ ఏడు మిలియన్ బ్యారెళ్ల చమురును భద్రపరచొచ్చు. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో ఈ దీవి వాటా 90 శాతం. యుద్ధం మొదలైనప్పటి నుంచి 13 మిలియన్ బ్యారెళ్ల చమురును ఇరాన్ ఇక్కడి నుంచే ఎగుమతి చేసింది.
Also Read..
Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో అనిశ్చితి..
గ్యాస్, పెట్రోల్ కొరత.. రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్..
స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కంటిన్యూ.. భారీగా పతనమైన సూచీలు..
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






