Kerosene | గ్యాస్, పెట్రోల్ కొరత.. రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్..
Kerosene | దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. చమురు కంపెనీలపై ఒత్తిడిని, వంట గ్యాస్ సమస్య (LPG Cylinders) తగ్గించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ (SKO) పంపిణీ చేయాలని నిర్ణయించింది.
Kerosene | త్రినేత్ర.న్యూస్: దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. చమురు కంపెనీలపై ఒత్తిడిని, వంట గ్యాస్ సమస్య (LPG Cylinders) తగ్గించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ (SKO) పంపిణీ చేయాలని నిర్ణయించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కిరోసిన్‌ను పంపిణీ చేయనుంది. సర్వీస్ స్టేషన్లలో 2,500 లీటర్ల వరకు కిరోసిన్ (Kerosene) నిల్వకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 60 రోజులపాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో ఇండ్లలో వంట, దీపాలు వెలిగించడానికి కిరోన్‌ను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎస్‌కేవో కేటాయించాలని ఆర్డర్ ఇచ్చాయి. అయితే హిమాచల్‌ప్రదేశ్, లడఖ్ ప్రస్తుతం తమకు కిరోసిన్ అవసరం లేదని తెలిపాయి. కాగా, మార్చి 14 నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు 39,368 మిలియన్ టన్నుల గ్యాస్‌ను చమురు కంపెనీలు పంపిణీ చేశాయి. అదేవిధంగా సాధారణం కంటే 48 వేల కిలోలీటర్ల కిరోసిన్‌ను రాష్ట్రాలకు కేటాయించాయి.
తాజావార్తలు
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
- ●Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
- ●Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
- ●TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ

Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..

TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు






