Donlad Trump | నెతన్యాహుకు వేరే దారి లేదు.. ఇరాన్‌తో ఒప్పందాన్ని అంగీకరించాల్సిందే : డొనాల్డ్ ట్రంప్
Donlad Trump | ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు (Benjamin Netanyahu) వేరే దారి లేదని.. ఇరాన్‌తో ఒప్పందానికి అంగీకరించక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donlad Trump) స్పష్టం చేశారు. శాంతి ప్రక్రియలో తనదే తుది నిర్ణయమని వెల్లడించారు.
International | Published On Jun 8, 2026, 12.17 pm IST
Donlad Trump | ఇరాన్‌తో ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని.. దాడులు చేయొద్దంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donlad Trump) ఎంత చెప్పినా ఇజ్రాయెల్ వినడం లేదు. టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు (Benjamin Netanyahu) వేరే దారి లేదని.. ఇరాన్‌తో ఒప్పందానికి అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు.
"ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపే దాడులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేది నేనే. నెతన్యాహు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేరు. మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్‌తో వాషింగ్టన్ కుదుర్చుకునే ఎలాంటి ఒప్పందాన్నైనా అంగీకరించడం మినహా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రికి మరో ప్రత్యామ్నాయం లేదు" అని ది ఫైనాన్సియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చర్చలు ముగించాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ శాంతి ప్రక్రియలో తనదే తుది నిర్ణయమని వెల్లడించారు. ఇరాన్‌పై ఎలాంటి ప్రతీకార దాడులూ చేయొద్దంటూ ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ సూచించారు. అయితే, ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్‌పై ఐడీఎఫ్ దళాలు విరుచుపడ్డాయి.
టెహ్రాన్‌లో పేలుళ్ల మోత..!
లెబనాన్‌తో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ దళాలు బీరుట్ శివార్లలో భీకర దాడులు చేశాయి. దీనికి ప్రతికారంగానే ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని ఆదివారం రాత్రి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఆ తర్వాత ఇవాళ తెల్లవారుజామున టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడ్డాయి. దీంతో ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.
Also Read..
ట్రంప్ వద్దన్నా వినని ఇజ్రాయెల్.. ఇరాన్‌పై భీకర దాడులు!
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఊహించని ప్రమాదం.. విమానాలను ఢీ కొన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాలు
సంబంధిత వార్తలు

Nigeria | ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. నైజీరియాలో పిల్లలపై తీవ్ర ప్రభావం..
జులై 21, 2026

DGMA | హర్మూజ్ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
జులై 16, 2026

Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం
జులై 15, 2026
తాజావార్తలు
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు



