Peddi Sudarshan Reddy | ‘పెద్ది’ ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం : తన్నీరు మహేశ్
Peddi Sudarshan Reddy | నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం అని తెలంగాణ ఎన్నారై తన్నీరు మహేశ్ భావోద్వేగానికి లోనయ్యారు.
International | Published On Aug 1, 2026, 7.34 pm IST
Peddi Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్ : నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం అని తెలంగాణ ఎన్నారై తన్నీరు మహేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసిన నిస్వార్థ యోధుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తన్నీరు మహేశ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలకు పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా దగ్గరి వ్యక్తి. నర్సంపేటలో జరిగిన ప్రతి ఎన్నికలో ప్రత్యక్షంగా పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డి తరపున ప్రచారం చేసేవాళ్లం. ఆయన చేసిన అభివృద్ధి, మిషన్ కాకతీయ, పాకాల టు రామప్ప లింక్, మెడికల్ కాలేజీ, సైనిక్ స్కూల్ అభివృద్ధి గురించి చెప్తున్నప్పుడు తన కళ్లల్లో ఆనందం, తన ఛాతీలో గర్వం ఉప్పొంగేది. ఆయనలో సంతోషాన్ని చూస్తే మాకు చాలా ఆనందంగా అనిపించేది. ఇందుకు కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. ఇలాంటి నాయకులు కదా మాకు కావాలె అని అనిపించేది. పెద్ది లేకపోవడం ఎన్నారైలకు చాలా బాధాకరం. వారి ఉద్యమ స్ఫూర్తి, అభివృద్ధి స్ఫూర్తి, ఆశయాలు మాకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. వారు ఎప్పుడ మాతోనే ఉంటారు అని తన్నీరు మహేశ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత






