BJP Ramchandar Rao- ATA | అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర ఎనలేనిది.. ఇక్కడికొచ్చి కూడా సంసృతిని కాపాడడం అభినందనీయం
BJP Ramchandar Rao- ATA | అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర కీలకంగా ఉందని బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ రామచంద్ర రావు అన్నారు. అమెరికా వచ్చినా భారతీయ సంసృతిని కాపాడుకోవడం అభినందనీయం అన్నారు. అన్ని దేశాలలో సత్సంబంధాలు ఉండేలా ప్రధాని మోదీ కృషి చేశారని చెప్పారు.
- బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
BJP Ramchandar Rao- ATA | త్రినేత్ర.న్యూస్: అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర కీలకంగా ఉందని బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ రామచంద్ర రావు అన్నారు. అమెరికా వచ్చినా భారతీయ సంసృతిని కాపాడుకోవడం అభినందనీయం అన్నారు. అన్ని దేశాలలో సత్సంబంధాలు ఉండేలా ప్రధాని మోదీ కృషి చేశారని చెప్పారు. తమ సంసృతి కాపాడుకుంటూనే తెలుగుదనాన్ని నిలబెట్టడంలో ఆటా పాత్ర కీలకమన్నారు. రెండో రోజు అమెరికాలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో 19వ మహాసభ ల్లో రామచంద్ర రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, BRS, BJP, TDP, YSRCP నుంచి ముఖ్య నాయకులు బాంక్వెట్ హాల్ మీటింగుకు హాజరై ప్రసంగించారు. అమెరికాలో తెలుగు వారి స్ఫూర్తిని కొనియాడారు. ఈ సభలకు అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరయ్యారు.

తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలి..
మరోవైపు అమెరికాలోని ఒక రాష్ట్రంలా తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. NRIలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. తెలుగు ప్రజలు అమెరికాలో కష్టపడి ఎదిగి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఆటా మహాసభల సందర్భంగా బంక్వెట్ సమావేశంలో ప్రసంగించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు గా కలిసి ఉందాం అని కోరారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణంతో BRS సీనియర్ నేత హరీష్ రావు ఆటా మహాసభలకు హజరుకలేకపోయారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, పుట్ట మధు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాలమల్లు, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, గ్రంథాలయ మాజీ ఛైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ ఇన్‌చార్జ్ మహేష్ తన్నీరు, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, చందు తాళ్లా, నరసింహ నాగులవంచ, రజనీకాంత్ కోసనం పాల్గొన్నారు.

రెండో రోజు ఆటా మహాసభల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 130 మంది కళాకారులు బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనిల్ బోయినపల్లి ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ ఫోరమ్ లో మేరీల్యాండ్ గవర్నర్ అరుణ మిల్లర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహిత్య వేదిక, ఉమెన్ ఫోరమ్ సమావేశాలలోనే వందలాది మంది పాల్గొన్నారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చన కొచ్చర్ నేతృత్వంలో జరిగిన ఫ్యాషన్ షో కళ్ళు జిగేల్ మన్నాయి. తెలంగాణ చేనేత కార్మికులు ప్రత్యేకంగా నేసిన వస్త్రాలతో వందల మంది యువతీ యువకులు ఈ షోలో పాల్గొన్నారు.
పరంపర పేరుతో చేసిన శివ పార్వతుల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. యుఎస్ ఆర్మీలో సేవలు అందించిన తెలుగు వారిని ఆటా వేదికగా ప్రత్యేకంగా సన్మానించారు. ఆటా మహాసభల వేడుకలకు స్పాన్సర్ చేసిన వారి కుటుంబాలను కూడా అభినందించారు. సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, పూజ హెగ్డే, రీతూ వర్మ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి
అక్టోబర్ 4, 2026

B. Narsing Rao | తెలంగాణ దర్శకుడు బీ నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్
అక్టోబర్ 2, 2026

Chamala Kirankumar Reddy | అమెరికాలో 30 ఏండ్లుగా ఉంటున్నోళ్లే హోటల్ పెట్టలేకపోయారు.. కేటీఆర్ ఆరేండ్లే ఉండి 3 స్టార్ హోటల్స్ కొన్నారా?
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
- ●MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..
- ●Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
- ●CJP | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..

MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..

Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..



