Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత – రాజమౌళి సినిమాతో ఫేమస్ – ఐదు భాషల్లో సినిమాలు
ప్రముఖ టాలీవుడ్ నటుడు, సై మూవీ ఫేమ్ ప్రదీప్ రావత్ మంగళవారం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రదీప్ రావత్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోన్నట్లు సమాచారం. తెలుగులో సై, ఛత్రపతి, అందరివాడు, దేశముదురుతో పాటు పలు సినిమాల్లో విలన్‌గా నటించాడు.
Entertainment | Published On Aug 4, 2026, 10.59 pm IST
Pradeep Rawat | ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ రావత్ (74)అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతోన్నట్లు తెలిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం తుది శ్వాస విడిచినట్లు సన్నిహితులు పేర్కొన్నారు. హిందీ సినిమాలతో ప్రదీప్ రావత్ కెరీర్ ప్రారంభమైంది. కానీ తెలుగు సినిమాలే నటుడిగా అతడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. టాలీవుడ్‌లో యాభైకిపైగా సినిమాలు చేశారు. ఎక్కువగా విలన్ పాత్రల్లోనే కనిపించారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు.
సైతో ఫేమస్...
నితిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సై సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రదీప్ రావత్. ఈ సినిమాలో భిక్షూ యాదవ్ పాత్రలో తన విలనిజంతో తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టాడు. సైతో ఫేమస్ అయిన ప్రదీప్ రావత్ తెలుగులో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ఛత్రపతి, అందరివాడు, మాయాజాలం, లక్ష్మి, దేశముదురు, బలాదూర్, గజినితో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్‌గా కనిపించాడు.
నేను శైలజ, ఓయ్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు చేశాడు. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం సినిమాతో చివరగా నటించాడు.
అశ్వాత్థామ పాత్రలో...
రాజ్‌బబ్బర్ హీరోగా నటించిన ఐత్‌బార్ మూవీతో ప్రదీప్ రావత్ సినీ జర్నీ మొదలైంది. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించాడు. అగ్నిపథ్, భాఘీ, కోయ్లాతో పాటు చాలా సినిమాలు చేశాడు. హిందీలో ఎక్కువగా ఆమిర్‌ఖాన్ సినిమాల్లో ప్రదీప్ రావత్ కనిపించేవారు. సినిమాల కంటే ముందు మహాభారతం సీరియల్‌లో అశ్వత్థామ పాత్రలో ప్రదీప్ రావత్ నటించాడు.
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క
- ●Vijay-Stalin Junior War | సమస్య పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే తప్పేంటి..? సీఎం విజయ్ Vs జూనియర్ స్టాలిన్
- ●BJP Ramchandar Rao | తెలంగాణకు గొప్ప చేనేత వారసత్వం ఉంది.. కార్మికుల సమస్యల కోసం బీజేపీ పోరాడుతుంది
- ●Rahul Gandhi | బీజేపీలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు?.. ఇదీ రాహుల్ గాంధీ సమాధానం.. వీడియో
- ●Stocks | ఎరోస్పేస్ రంగంలో దూసుకెళ్తున్న 3 కంపెనీలు.. భారీ రాబడులపై కన్నేసిన పెట్టుబడిదారులు..
- ●Assault | భార్యపై కోపంతో.. నాలుగేండ్ల కూతురిపై లైంగికదాడి..

Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క

Vijay-Stalin Junior War | సమస్య పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే తప్పేంటి..? సీఎం విజయ్ Vs జూనియర్ స్టాలిన్

BJP Ramchandar Rao | తెలంగాణకు గొప్ప చేనేత వారసత్వం ఉంది.. కార్మికుల సమస్యల కోసం బీజేపీ పోరాడుతుంది

Rahul Gandhi | బీజేపీలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు?.. ఇదీ రాహుల్ గాంధీ సమాధానం.. వీడియో



