CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
CM Revanth Reddy | రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని దశల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని దశల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నియామక ప్రక్రియకు భంగం కలిగించేలా కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థ ప్రయోజనాల శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి నివేదించాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రతి దశను నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణ, భద్రపరిచడం, రవాణా తదితర ప్రక్రియల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్ఠం చేయాలని, ముఖ్యంగా కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. నియామక పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల ద్వారా దుష్ప్రచారం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. పరీక్షల ప్రక్రియ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తి అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వీ శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026

Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
- ●KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
- ●CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి
- ●Monkey Skull in Bag | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికుడి బ్యాగ్‌లో 'కోతి పుర్రె'
- ●TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
- ●Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం

Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం

CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి

Monkey Skull in Bag | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికుడి బ్యాగ్‌లో 'కోతి పుర్రె'



