PM Modi | భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం సరఫరా చేస్తుంది : ప్రధాని మోదీ
PM Modi | ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, సరఫరా గొలుసు అంతరాయాలు, ఇంధన సంక్షోభం వంటి సవాళ్ల నేపథ్యంలో భారత్-ఆస్ట్రేలియా వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
PM Modi | ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, సరఫరా గొలుసు అంతరాయాలు, ఇంధన సంక్షోభం వంటి సవాళ్ల నేపథ్యంలో భారత్-ఆస్ట్రేలియా వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia)లో ప్రధాని పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese)తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అణు ఇంధనం, రక్షణ, కీలక ఖనిజాలు, ఇండో-పసిఫిక్ భద్రత తదితర రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి.
భారత్‌కు యురేనియం సరఫరా..
చర్చల అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం సరఫరా (Uranium Supply) చేస్తుందని ప్రకటించారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన (clean energy) లక్ష్యాలకు భారీ ఊతాన్నిస్తూ అణుశక్తి రంగంలో ఇరు దేశాలు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు చెప్పారు. 2015లో కుదిరిన అణు సహకార ఒప్పందం కింద యురేనియం ఎగుమతులకు అవసరమైన పరిపాలనా ప్రక్రియలను కూడా పూర్తి చేసినట్లు చెప్పారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చే యురేనియం పూర్తిగా శాంతియుత అవసరాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై ‘ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ’ భద్రతా నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. దీంతోపాటూ సరఫరా గొలుసులను (supply chains) బలోపేతం చేయడానికి, స్వచ్ఛ ఇంధన పరివర్తన (Clean Energy Transition)కు మద్దతు ఇవ్వడానికి భారత్, ఆస్ట్రేలియాలు కలిసి 'క్రిటికల్ మినరల్స్ కారిడార్' పై పని చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు.
రక్షణ రంగంలో సహాకారం..
రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల మధ్య 'ఇండియా-ఆస్ట్రేలియా డిఫెన్స్ ఇన్నోవేషన్ కారిడార్' ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దీని ద్వారా రక్షణ రంగ స్టార్టప్‌లను, పరిశ్రమలను అనుసంధానించడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఓడల నిర్మాణం, రిపేరింగ్, నిర్వహణ రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ప్రధాని వివరించారు. ఇండో-పసిఫిక్ అనేది కేవలం రెండు మహాసముద్రాల కలయిక మాత్రమే కాదని, భారత్,ఆస్ట్రేలియా వంటి ఒకే భావజాలం గల ప్రజాస్వామ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలను కూడా సూచిస్తుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మన భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్ అంత లోతుగా ఉంది..
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య ఉన్న సంబంధాలను ప్రధాని మోదీ క్రికెట్ మ్యాచ్‌తో పోల్చారు. "ఈ రోజు ప్రపంచ క్రీడా రాజధాని అయిన మెల్‌బోర్న్‌లో ఉంటూ క్రీడల గురించి మాట్లాడకపోవడం అనేది.. క్రికెట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి కూడా ఆటను ప్రారంభించకపోవడం లాంటిదే అవుతుంది. మా ఎజెండా వన్డే ఇంటర్నేషనల్ (ODI) లాగా ఎంతో ఫోకస్డ్‌గా ఉంది. మా నిర్ణయాలు టీ20 మ్యాచ్ అంత వేగంగా ఉన్నాయి. మా భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్ అంత పటిష్టంగా, చాలా లోతుగా ఉంది" అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక ఈ పర్యటనలో రక్షణ, సముద్ర భద్రత, అణుశక్తి వంటి రంగాలు సహా మొత్తం 18 అంశాలపై ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు.
Also Read..
శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించిన బీఎస్‌ఎన్‌ఎల్.. ఇప్పుడు ఎవరైనా కొనవచ్చు.. ధర ఎంతంటే..?
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్
మెటా మ్యూస్ ఇమేజ్ వచ్చేసింది.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐతో ఫొటోలకు కొత్త రూపం..
సంబంధిత వార్తలు

PM Modi International Awards | ప్రధాని మోదీకి 35 అంతర్జాతీయ పురస్కారాలు: ఏ దేశం నుంచి ఏ అవార్డు వచ్చిందంటే?
జులై 8, 2026

Priyank Kharge | ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్తారు : ప్రియాంక్ ఖర్గే
జులై 8, 2026

Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
జులై 8, 2026
తాజావార్తలు
- ●Awiqli | షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఇక వారికి ఒక్క ఇంజక్షన్ చాలు
- ●CM Revanth Reddy | హైదరాబాద్‌లో కాలుష్య రహిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Nissan Tekton | నిస్సాన్ టెక్టన్ ఎస్యూవీ లాంచ్.. రూ.10.49 లక్షల నుంచే ధర, 5 స్టార్ సేఫ్టీతో మార్కెట్లోకి..
- ●Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
- ●Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు
- ●Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..

Awiqli | షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఇక వారికి ఒక్క ఇంజక్షన్ చాలు

CM Revanth Reddy | హైదరాబాద్‌లో కాలుష్య రహిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

Nissan Tekton | నిస్సాన్ టెక్టన్ ఎస్యూవీ లాంచ్.. రూ.10.49 లక్షల నుంచే ధర, 5 స్టార్ సేఫ్టీతో మార్కెట్లోకి..

Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం



